Ekta Kapoor | చిక్కుల్లో నిర్మాత ఏక్తా కపూర్.. పోక్సో చట్టం కింద కేసు నమోదు..!
Ekta Kapoor | ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఆల్ట్ బాలాజీ బోల్డ్ కంటెంట్ ‘గంధీభాత్’ వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Ekta Kapoor | ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ చిక్కుల్లో పడ్డారు. ఆల్ట్ బాలాజీ బోల్డ్ కంటెంట్ ‘గంధీభాత్’ వెబ్ సిరీస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏక్తా కపూర్‌తో పాటు ఆమె తల్లి శోభా కపూర్‌పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వెబ్ సిరీస్ సీజన్-6లోని ఓ ఎపిసోడ్లో మైనర్ బాలికల అశ్లీల దృశ్యాల నేపథ్యంలో ఏక్తా కపూర్‌తో పాటు శోభా కపూర్‌పై ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ముంబయి బోరివాలిలోని ఎంహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌లో ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి-ఏప్రిల్ మధ్య ఆల్ట్ బాలాజీలో ప్రసారమైన గంధీభాత్ వెబ్ సిరీస్‌లో మైనర్ బాలికలను అభ్యంతరకర సన్నివేశాల్లో చూపించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు.
అయితే, ఈ సిరీస్ ప్రసారం నుంచి రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదస్పద ఎపిసోడ్‌ని యాప్‌లో స్ట్రీమింగ్ నుంచి తొలగించారు. గొప్ప వ్యక్తులతో పాటు సాధువులను సైతం అవమానించారని సదరు వ్యక్తి ఆరోపించారు. సన్నివేశాలు అభ్యంతరకరమని.. మనోభావాలు దెబ్బతీసేలా ఉందన్నారు. పోక్సో నిబంధనలు ఉల్లంఘించే సన్నివేశాలు ఉన్నాయన్నారు. పోక్సోతో పాటు సమాచార సాంకేతిక చట్టం-2000, మహిళా నిషేధ చట్టం 1986, పొగాకు ఉత్పత్తుల చట్టం-2003 తదితర చట్టాలను ఉల్లంఘించినట్లు ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో పిల్లలకు సంబంధించి అభ్యంతర కంటెంట్‌పై సుప్రీంకోర్టు ఈ ఏడాది సెప్టెంబర్‌లో కీలక ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. పిల్లల అశ్లీల కంటెంట్ చూసినా.. డౌన్లోడ్ చేసినా, షేర్ చేయడం నేరమేననని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
Naveen Polishetty | నవీన్ పొలిశెట్టిపై అభిమానుల అసహనం.. ఇంతకాలం సైలెన్స్ వెనుక కారణమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

