Skanda Movie | స్కంద నుంచి గందరబాయి వీడియో సాంగ్ రిలీజ్.!
Skanda Movie | టాక్ సంగతి పక్కన పెడితే స్కంద లాంగ్ వీకెండ్‌ను కుమ్మేసింది. వరుసగా ఐదు రోజులు టాక్‌తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొట్టింది. సోమవారం కూడా ఈ సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.7 కోట్ల వరకు కలెక్షన్లు సాధించడం అంటే మాములు విషయం కాదు.
Skanda Movie | టాక్ సంగతి పక్కన పెడితే స్కంద లాంగ్ వీకెండ్‌ను కుమ్మేసింది. వరుసగా ఐదు రోజులు టాక్‌తో సంబంధం లేకుండా కోట్లు కొల్లగొట్టింది. సోమవారం కూడా ఈ సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.7 కోట్ల వరకు కలెక్షన్లు సాధించడం అంటే మాములు విషయం కాదు. అది కూడా డిజాస్టర్ టాక్‌తో. ఇక మంగళవారం నుంచి ఈ సినిమా లెక్కలు తారుమారయ్యారు. దాదాపుగా ఈ సినిమా పని అయిపోయినట్లే. నిజానికి ఈ సినిమాకొచ్చిన టాక్‌కు ఎప్పుడో బిస్తరు కట్టాల్సింది. కానీ బోయపాటి మాస్ ఎలివేషన్స్, రామ్ మేకోవర్, యాక్షన్లకు బీ, సీ సెంటర్లు జనాలు వత్తాసు పలికారు.
సినిమా అంతా ఒకెత్తయితే.. థమన్ మ్యూజిక్ మరో ఎత్తు. రామ్ ప్రమోషన్లలో చెప్పినట్లుగానే థియేటర్ ఓనర్లు సౌండ్ బాక్స్‌లను రెనోవేట్ చేసుకునే దాకా పరిస్థితి వచ్చింది. అయితే సినిమాలో పాటలు మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే గందరబాయ్ పాటకు మాత్రం థియేటర్లో మాస్ రెస్పాన్స్ వచ్చింది. రామ్, శ్రీలీల ఎనర్జీస్టెప్స్కు ఆడియెన్స్ సైతం కాళ్లు కదిపారు. కాగా ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించే ప్రయత్నంగా తాజాగా ఈ పాట వీడియో సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు. మరీ సినిమా రిజల్ట్ చూసి.. సీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టేస్తారా.. లేదంటే తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Walking | ట్రెడ్‌మిల్‌పై నడవడమా? పార్కుల్లో వాకింగా? ఏది బెటర్?
IND vs NZ ODI | భారత్-కివీస్ తొలి వన్డేకు వరుణుడి బ్రేక్.. వర్షంతో ఆలస్యమైన టాస్
IND vs NZ | ఇక వన్డే సవాల్.. రోకోపైనే అందరి చూపు
Water Shortage | కాలేజీల్లో నీటి కొరత.. క్లాసులు బంద్.. విద్యార్థులను ఇంటికి పంపిన నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలు
SSC Exam Fee | విద్యాశాఖ డొల్లతనం.. టెన్త్ పరీక్ష ఫీజుల ఆన్లైన్ చెల్లింపుల్లో సర్వర్ సమస్య
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

