Game Changer | నేను సోలోగా వచ్చి నాలుగు ఏండ్లు అవుతుంది : రామ్ చరణ్
Game Changer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) దిగ్గజ దర్శకుడు శంకర్(Shankar) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు (Dil Raju) నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
Game Changer | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan Tej) దిగ్గజ దర్శకుడు శంకర్(Shankar) కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. ఈ సినిమాను అగ్ర నిర్మాత దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. రామ్ చరణ్ – శంకర్ – దిల్ రాజు కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నేడు అమెరికాలోని టెక్సాస్‌లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టైం ఒక ఇండియన్ సినిమాను అందులో ఒక తెలుగు సినిమాను ఇండియాలో కాకుండా వేరే దేశంలో నిర్వహిస్తున్నారు.
అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా.. ఇప్పటికే నటుడు రామ్ చరణ్‌తో పాటు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు శంకర్లు డల్లస్‌లో ల్యాండ్ అయ్యారు. రామ్ చరణ్ అమెరికాకు చేరుకోగానే మెగా అభిమానులు నుంచి ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే ప్రీ రిలీజ్ వేడుకకు ముందు ప్రెస్ మీట్ నిర్వహించగా.. ఇందులో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన సినిమా సోలోగా వచ్చి నాలుగు ఏండ్లు అవుతుందని తెలిపాడు.
”నేను సోలోగా వచ్చి నాలుగు ఏండ్లు అవుతుంది. చివరిగా నా బ్రదర్ తారక్‌తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేశాను. ఇప్పుడు వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఈ సినిమాతో మిమ్మల్ని అస్సలు నిరాశపరచము. అది మనందరికీ అద్భుతమైన సంక్రాంతి అవుతుందంటూ” రామ్ చరణ్ చెప్పుకోచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

