Kireeti Reddy New Movie Title Poster | కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ తనయుడు కిరీటి రెడ్డి సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు తెలిసిందే. కన్నడలో వచ్చిన ‘మాయబజార్’ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. తెలుగు మూలాలున్న గాలి జనార్థన్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇవ్వనుండటంతో ప్రేక్షకులలో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన స్టంట్ వీడియోకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రానికి ‘జూనియర్’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో కిరిటీ కాలేజ్ బ్యాగ్ వేసుకొని స్టైలిష్‌లుక్‌లో ఉన్నాడు. పోస్టర్‌తో పాటు టైటిల్ లాంచ్ వీడియోను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడు. కిరీటి రెడ్డికి జోడీగా పెళ్ళి సందడి ఫేం శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. జెనీలియా కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సౌత్‌లోని అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
Introducing @KireetiOfficial in #Junior#Junior Title Launch Video: https://t.co/wMUxH4sVMd
UNLIMITED ENTERTAINMENT GUARANTEED 😎#JuniorTheMovie@rk91_reddy @geneliad #Sreeleela @ThisIsDSP @DOPSenthilKumar @CrazystarL @PeterHeinOffl @VaaraahiCC @SaiKorrapati_ @proyuvraaj pic.twitter.com/JX7hJq1r7b
— BA Raju's Team (@baraju_SuperHit) September 30, 2022