Project K Glimpse | కలియుగ వీరుడిగా ప్రభాస్.. అంచనాలు పెంచేస్తున్న ప్రాజెక్ట్ కే!
Project K Glimpse | అమెరికా శాండియాగో కామిక్ కాన్ వేడుకలో ‘ప్రాజెక్ట్-కె’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్గ్లింప్స్తో పాటు టైటిల్‌ను రివీల్ చేయబోతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే ఈ సినిమా కథేమిటన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది.
Project K Glimpse | అమెరికా శాండియాగో కామిక్ కాన్ వేడుకలో ‘ప్రాజెక్ట్-కె’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్గ్లింప్స్తో పాటు టైటిల్‌ను రివీల్ చేయబోతున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్అశ్విన్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే భారీ అంచనాలేర్పడ్డాయి. అయితే ఈ సినిమా కథేమిటన్నది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కామిక్ పోస్టర్‌ను శాండియాగో కామిక్ కాన్ వేడుకలో విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను కొందరు అభిమానులు తమ సోషల్‌మీడియా ఖాతాల్లో పంచుకున్నారు. ఈ పోస్టర్‌పై ఉన్న రైటింగ్స్‌ను గమనిస్తే దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం కలియుగంలో అవతరించిన ఓ వీరుడి కథ ఇదని అర్థమవుతున్నది.
‘కలియుగపు చీకటి రోజుల్లో ఓ దుష్టశక్తి ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. దేవుళ్లను కూడా అంతం చేస్తానని ప్రతినబూనుతుంది. ప్రజలందరూ తన బానిసలుగా ఉండాలని ఆజ్ఞాపిస్తుంది. ఆ దుష్టశక్తిని, దాని అనుచరగణాన్ని అంతమొందించడానికి ఓ వీరుడు ఉద్భవిస్తాడు’ అంటూ కామిక్ పోస్టర్‌పై రాసివున్న మాటలు సినిమా కథ గురించి తెలియజేస్తున్నాయి. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు నాగ్అశ్విన్..మానవ రూపంలో ఉన్న అవతార పురుషుడు కథ ఇదని పేర్కొన్నారు. తాజాగా రిలీజైన కామిక్ పోస్టర్ కూడా ఇదే విషయాన్ని ధృవపరుస్తున్నది. కామిక్ కాన్ ఈవెంట్లో కమల్‌హాసన్, ప్రభాస్, నాగ్అశ్విన్, రానా తదితరులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం వీరి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైజయంతీ మూవీస్ పతాకంపై సి.అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

