Fauzi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫౌజీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘సీతారామం’ వంటి క్లాసిక్ హిట్ తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ దశలో శరవేగంగా సాగుతోంది. ఇలాంటి సమయంలో మూవీ టీంకు షాక్ ఇస్తూ సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీక్ కావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మొదట ఈ ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా రూపొందించబడినవని అనుమానించినప్పటికీ, అవి నిజమైన షూటింగ్ స్టిల్స్ అని తర్వాత స్పష్టమైంది.
ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చిత్ర యూనిట్ తీవ్రంగా స్పందించింది. ఈ లీక్స్ సినిమా అనుభవాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంటూ వెంటనే వాటిని షేర్ చేయడం ఆపాలని అభిమానులు, నెటిజన్స్‌కు విజ్ఞప్తి చేసింది చిత్ర బృందం. మూవీ టీం అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో, ఫౌజీ సెట్స్ నుంచి లీకైన కొన్ని ఫోటోలు మా దృష్టికి వచ్చాయి. మేము ఎంతో కష్టపడి, అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తున్న అనుభవాన్ని ఈ లీక్స్ దెబ్బతీస్తున్నాయి. వెండి తెరపై ప్రేక్షకులకు అందించబోయేది మరింత గొప్పగా ఉంటుంది. కాబట్టి లీక్ అయిన కంటెంట్‌ను షేర్ చేయకూడదని కోరుతున్నాం” అని పేర్కొన్నారు. అదే సమయంలో, ఈ హెచ్చరికను పట్టించుకోకుండా లీక్ ఫోటోలను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా స్పష్టం చేశారు.
ఈ చిత్రం పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్, ఎమోషన్ మేళవింపుగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. ప్రభాస్ లుక్, కథ, ట్రీట్మెంట్ అన్నీ ప్రత్యేకంగా ఉండబోతున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై ఫ్యాన్స్‌లో భారీ హైప్ నెలకొంది. ఇటీవల పెద్ద సినిమాల విషయంలో సెట్స్ నుంచి ఫోటోలు, వీడియోలు లీక్ కావడం సాధారణంగా మారింది. దీనిని అరికట్టేందుకు చిత్ర బృందాలు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ‘ఫౌజీ’ టీం కూడా ఇప్పుడు లీక్స్‌పై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైందని ఈ సంఘటనతో స్పష్టమవుతోంది.