Sai Pallavi | దక్షిణాది సినీ పరిశ్రమ (South Film Industry)లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ల జాబితాలో టాప్‌లో ఉంటుంది సాయిపల్లవి (Sai Pallavi). ఈ కోలీవుడ్ సోయగం అందం, అభినయం, డ్యాన్స్.. ఇలా ఏ విషయంలో కూడా తగ్గేదేలే అనే ఫార్ములాను పర్ఫెక్ట్గా అప్లై చేస్తుంటుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసిన ఈ బ్యూటీ శ్యామ్ సింగరాయ్, గార్గి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకే తొలి ప్రాధాన్యత ఇచ్చే ఈ భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.
అయితే తమ అభిమాన నటి నుంచి సినిమా రాక చాలా కాలం అవుతుండటంతో.. నిరాశలో మునిగిపోతున్నారు అభిమానులు. ఇప్పటికే సాయిపల్లవి సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక ఏడాదిన్నరకుపైగా అవుతోంది. సాయిపల్లవి చివరి సినిమా విరాటపర్వం 2022 జూన్‌లో విడుదలైంది. ఆ తర్వాత గార్గి సినిమా గతేడాది జులైలో డైరెక్టుగా ఓటీటీలో విడుదలైంది. ఇక అప్పటి నుంచి ఈ భామ నుంచి కొత్త సినిమాలేవి విడుదల కాలేదు. సాయిపల్లవి ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్‌తో కలిసి నటిస్తోన్న చిత్రం SK21. తాజాగా కోలీవుడ్ సర్కిల్లో రౌండప్ చేస్తున్న కథనాల ప్రకారం SK21 ఆగస్టు 2024లో గ్రాండ్‌గా విడుదల కానుందట.
ఇదే నిజమైతే అభిమానులు సాయిపల్లవిని బిగ్ స్క్రీన్‌పై చూడాలంటే రెండేళ్ల తర్వాత సాధ్యం కానుందన్నమాట. ఈ లెక్కన సుదీర్ఘకాలం కొత్త సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల్లో కేవలం సాయిపల్లవి ఫ్యాన్స్ మాత్రమే టాప్‌లో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. SK21 చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే సాయిపల్లవి కశ్మీర్ లొకేషన్లో దిగిన స్టిల్స్ నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి.
మరోవైపు చందూమొండేటి డైరెక్షన్లో నాగచైతన్య నటిస్తోన్న తండేల్‌లో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది సాయిపల్లవి. లవ్ స్టోరీ తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా ఇది.
Your Heart is the Gun and Army of One, HBD @Rajkumar_KP #HappyBirthdayRajkumarPeriasamy#HBDRajkumarPeriasamy#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SK21 #RKFIProductionNo_51 @ikamalhaasan @Siva_Kartikeyan #Mahendran @gvprakash @Sai_Pallavi92 @RKFI @ladasingh… pic.twitter.com/yQQ5DDeOp9
— Turmeric Media (@turmericmediaTM) October 22, 2023
According to Vikatan, the title announcement for #SK21 is set for this Diwali, with the next schedule taking place in Chennai & post-production occurring simultaneously; recently, @Siva_Kartikeyan met @ikamalhaasan at the #RKFI office, where #KamalHaasan warmly welcomed him as… pic.twitter.com/xVYmPJdSDn
— KARTHIK DP (@dp_karthik) October 11, 2023
శివకార్తికేయన్ న్యూ లుక్..
On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023