ఇంటిల్లిపాదీని మెప్పిస్తున్నది
చిత్రబృందం ఐక్యంగా చేసిన కృషి వల్లే ‘ఎఫ్ 3’ సినిమా ఘన విజయాన్ని సాధించిందని చెప్పారు వెంకటేష్. వరుణ్‌తేజ్‌తో కలిసి ఆయన హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ నాయికలుగా నటించారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు
చిత్రబృందం ఐక్యంగా చేసిన కృషి వల్లే ‘ఎఫ్ 3’ సినిమా ఘన విజయాన్ని సాధించిందని చెప్పారు వెంకటేష్. వరుణ్‌తేజ్‌తో కలిసి ఆయన హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ నాయికలుగా నటించారు. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో వెంకటేష్ మాట్లాడుతూ…‘సినిమా కోసం దాదాపు వంద రోజులు షూటింగ్ చేశాం. ఒక కుటుంబంలా కలిసి పనిచేశాం. ఒకరిని మరొకరు ఉత్సాహ పర్చుకున్నాం. ఒక్కటిగా కష్టపడటం వల్లే ఇవాళ మా సినిమా ఇంత ఘన విజయం సాధించింది.
గత కొంతకాలంగా కుటుంబ ప్రేక్షకులు సినిమాలకు దూరమయ్యారు. ఈ సినిమా కుటుంబమంతా కలిసి చూసి ఆనందించేలా ఉంటుంది. వాళ్లు రావడం వల్లే బ్లాక్ బస్టర్ దక్కింది’ అన్నారు. ‘పిల్లలకు, ఫ్యామిలీస్‌కు నచ్చే సినిమాలు అరుదు. అలాంటి అరుదైన సినిమా ‘ఎఫ్3’. మాకు ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన దర్శకుడు అనిల్‌కు థాంక్స్ చెబుతున్నాం’ అని అన్నారు హీరో వరుణ్ తేజ్. దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ…‘పాండమిక్ తర్వాత చిత్ర పరిశ్రమ కళ కోల్పోయింది. మళ్లీ ఇండస్ట్రీ పుంజుకోవాలంటే ప్రతి వారం విడుదలయ్యే సినిమా ఆదరణ పొందాలి. ఒక్కొక్కటిగా ప్రతి సినిమా ప్రేక్షకులను తిరిగి థియేటర్లకు తీసుకొస్తున్నది. వాటిలో మా సినిమా కూడా నిలిచినందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శిరీష్, నటుడు అలీ, అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

