Extra Ordinary Man | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man). నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా(Naa Peru Surya Naa Illu India) ఫేమ్ వక్కంతం వంశీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ మూవీలో శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తోండగా.. సీనియర్ హీరో రాజశేఖర్(Rajashekar) కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌తో పాటు డేంజర్ పిల్లా, బ్రష్ వేసుకో పాటలు అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ నుంచి మేకర్స్ ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ 27న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక ఈ సినిమా డిసెంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని నితిన్ హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.
Mana Trailer ready ❤️
Monday 27th NOV Kummedhaaam 😁#ExtraOrdinaryManTrailer #ExtraOrdinaryManOnDec8th pic.twitter.com/UEVRDpCEmB
— nithiin (@actor_nithiin) November 24, 2023