కాలర్ ఎగరేసుకొని బయటికొస్తారు!
‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ఈ తరహా క్యారెక్టర్ చేయలేదు. నాయకానాయికలు రిత్విక్, ఖ్యాతీ పాత్రలతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు’ అన్నారు నితిన్.
‘ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు ఈ తరహా క్యారెక్టర్ చేయలేదు. నాయకానాయికలు రిత్విక్, ఖ్యాతీ పాత్రలతో ప్రేక్షకులు ప్రేమలో పడతారు’ అన్నారు నితిన్. ఆయన కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ట్రా ఆర్డినరీమ్యాన్’. ఎన్.సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది.
సోమవారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. నితిన్ మాట్లాడుతూ ‘కామెడీ, మాస్ అంశాలతో సినిమా బాగా వచ్చింది. శ్రీలీల ఎంత బిజీగా ఉన్నా మాకు డేట్స్ కేటాయించింది. నిజ జీవితంతో తను ఎక్స్ట్రార్డినరీ ఉమెన్. ఈ సినిమా చూసిన నా ఫ్యాన్స్ అంతా కాలర్ ఎగరేసుకొని బయటకొస్తారు. పెద్ద హిట్ కొట్టబోతున్నామనే నమ్మకం ఉంది’ అన్నారు.
ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని, రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తామని దర్శకుడు వక్కంతం వంశీ తెలిపారు. ఈ సినిమా స్పెషల్ అప్పీయరెన్స్ పాత్రను చేశానని సీనియర్ నటుడు రాజశేఖర్ తెలిపారు. ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకం ఉందని, ప్రత్యేక పాత్రలో నటించిన రాజశేఖర్‌గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

