Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Sandeep Reddy Vanga | భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
Ramayana | భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన పౌరాణిక చిత్రం ‘రామాయణ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంటూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ సినిమా చూసిన సినీ ప్రముఖులు వరుసగా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఎక్స్ వేదికగా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమాలోని విజువల్స్, నటీనటుల అభినయం, నిర్మాత అంకితభావంపై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు.
శ్రీరాముడు, రావణాసురుల మధ్య ఉండే మహా వైభవాన్ని, భారీతనాన్ని బిగ్ స్క్రీన్‌పై అనుభవించాలంటే ప్రతి ఒక్కరూ కచ్చితంగా ‘రామాయణ’ సినిమాను థియేటర్లలో చూడాల్సిందేనని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, రావణుడి పాత్రలో యష్ తమ అద్భుతమైన నటనతో అదరగొట్టారని కొనియాడారు. తెరపై వారిద్దరి ఉనికి ఎంతో శక్తివంతంగా, కమాండింగ్‌గా ఉందని ఆయన ప్రశంసించారు. ఈ సినిమా తనకు ఎంతో విపరీతంగా నచ్చిందని మనసులోని మాటను బయటపెట్టారు.
ఇదే సమయంలో సినిమా నిర్మాత నమిత్ మల్హోత్రా అంకితభావాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి భారీ ప్రాజెక్ట్ కోసం ఏ నిర్మాత కూడా ఈ స్థాయిలో కష్టపడి, పూర్తిగా అంకితమవ్వడం తాను ఎప్పుడూ చూడలేదని, ఆయన నిబద్ధత తనకు ఎంతో ఆశ్చర్యం కలిగించిందని ప్రశంసలందించారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నియోజకవర్గాల పునర్విభజనపై మా వైఖరి ఎప్పుడైనా స్పష్టమే : కేటీఆర్
Mayawati | ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలి: మాయావతి
GLP-1 Medicine | జీఎల్పీ-1 మందులను వాడడం ఆపేస్తే ఏం జరుగుతుంది..? ఎలాంటి పరిణామాలు ఉంటాయి..?
BRS Bahrain | బహ్రెయిన్‌లో ఘనంగా దీక్షాదివస్..కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం : సతీష్ కుమార్
Naga Chaitanya | కమర్షియల్ సినిమా మారిపోయింది.. ఐదు పాటలు పెడితే ల్యాగ్ అంటున్నారు: నాగ చైతన్య
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

