Meenakshi Chaudhary | సంక్రాంతి కలిసొచ్చింది.. ఆ క్యారెక్టర్లో నటించాలన్నది నా డ్రీమ్: మీనాక్షి చౌదరి
‘పోలీస్ క్యారెక్టర్లో నటించాలన్నది నా డ్రీమ్. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర లభించడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది మీనాక్షి చౌదరి. అనతికాలంలోనే తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’.
‘పోలీస్ క్యారెక్టర్లో నటించాలన్నది నా డ్రీమ్. ఎప్పటి నుంచో అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి పాత్ర లభించడం ఆనందంగా ఉంది’ అని చెప్పింది మీనాక్షి చౌదరి. అనతికాలంలోనే తెలుగు అగ్ర కథానాయికల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తున్నది. ఈ సందర్భంగా శుక్రవారం మీనాక్షి చౌదరి పాత్రికేయులతో మాట్లాడింది. తాను ఇప్పటివరకు కామెడీ జోనర్ సినిమా చేయలేదని, తొలిసారి ఈ తరహా పాత్రలో నటించడం కొత్త అనుభూతినిచ్చిందని తెలిపింది. ఇందులో తాను యాక్షన్ సీక్వెన్స్ కూడా చేశానని, ఆ ఎపిసోడ్స్‌ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పింది.
‘పోలీస్ పాత్ర కోసం ఎలాంటి రిఫరెన్స్ తీసుకోలేదు. మా నాన్న ఆర్మీ ఆఫీసర్ కాబట్టి వారి బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ మీద అవగాహన ఉంది. నేను కూడా లేడీ పోలీసుల తాలూకు కొన్ని విషయాలను సేకరించాను’ అని చెప్పింది. వెంకటేష్ వంటి సీనియర్ నటుడితో కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయన ఎప్పుడూ ప్రశాంతగా కనిపిస్తారని, కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుందని మీనాక్షి చౌదరి పేర్కొంది. గత ఏడాది సంక్రాంతికి ‘గుంటూరు కారం’తో ప్రేక్షకుల్ని పలకరించానని, ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’లో భాగమయ్యానని, ఈ పండగ తనకు కలిసొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నానని, మరో రెండు చిత్రాలను త్వరలో ప్రకటిస్తానని మీనాక్షి చౌదరి తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

