Emmy Awards 2025 | అట్టహాసంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక.. ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకున్న అడాల్ సెన్స్
Emmy Awards 2025 | అంతర్జాతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు.
Emmy Awards 2025 | అంతర్జాతీయ సినీ పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే 77వ ఎమ్మీ అవార్డుల వేడుక లాస్ ఏంజెలెస్‌లోని పికాక్ థియేటర్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. హాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. ఎమ్మీ అవార్డులు అనేవి అమెరికన్ టెలివిజన్ పరిశ్రమలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వాటికి ఇచ్చే ప్రత్యేక గౌరవం. ఈ అవార్డులని అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రతి సంవత్సరం ఇస్తూ వస్తుంది. ఈసారి నామినేషన్ల బరిలో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు పోటీ పడ్డాయి. అందులో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ‘అడాల్సెన్స్ ఘన విజయం సాధించి ఏకంగా 5 అవార్డులు సొంతం చేసుకోవడం విశేషం. ఇక ఇందులో నటించిన ఓవెన్ కూపర్, చిన్న వయసులోనే ఎమ్మీ అవార్డు గెలుచుకుని కొత్త రికార్డు సృష్టించాడు.
ఈ వేడుకలో 2024-2025 సీజన్లో ప్రసారమైన కార్యక్రమాలకి అవార్డులని అందించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన అడోలెసెన్స్, ఆర్కేన్ లీగ్ ఆఫ్ లెజెండ్స్ సిరీస్ అవార్డులని దక్కించుకున్నాయి. ఇక సెవరెన్స్ డ్రామా సిరీస్‌లో అద్భుతమైన నటనకు గాను ట్రామెల్ టిల్మాన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డు అందుకోగా, ఆయన తొలి నల్లజాతి సంతతికి చెందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.
ప్రధాన విభాగాలలో విజేతల జాబితా చూస్తే..
ఉత్తమ డ్రామా సిరీస్ : ది పిట్ (The Pitt)
ఉత్తమ నటుడు : నోహ్ వైల్ (ది పిట్*)
ఉత్తమ నటి : బ్రిట్నీ లీ లోయర్ (సెవెరెన్స్)
ఉత్తమ కామెడీ సిరీస్ : ది స్టూడియో
ఉత్తమ సిరీస్ : అడాల్సెన్స్ (Adolescence)
సిరీస్ విభాగం అవార్డులు (Adolescence ఆధిపత్యం)
ఉత్తమ నటుడు (సిరీస్) : స్టీఫెన్ గ్రాహం (అడాల్సెన్స్)
ఉత్తమ సహాయ నటి (సిరీస్) : ఎరిన్ డోహెర్టీ (అడాల్సెన్స్)
ఉత్తమ సహాయ నటుడు (సిరీస్) : ఓవెన్ కూపర్ (అడాల్సెన్స్)
స్క్రిప్ట్ & దర్శకత్వ విభాగంలో
ఉత్తమ స్క్రిప్ట్ రైటర్ : లాస్ట్ వీక్ టునైట్.. (సాటర్డే నైట్ లైవ్)
ఉత్తమ దర్శకుడు : ఆడమ్ రాండాల్ (స్లో హార్సెస్)
ఉత్తమ దర్శకుడు (లిమిటెడ్ సిరీస్) : ఫిలిప్ బారంటిని (అడాల్సెన్స్)
కామెడీ విభాగంలో
ఉత్తమ సహాయ నటుడు (కామెడీ) : జెఫ్ హిల్లర్ (సమ్‌బడీ సమ్‌వేర్)
ఉత్తమ సహాయ నటి (కామెడీ) : హన్నా ఐన్‌బైండర్ (హ్యాక్స్)
ఉత్తమ రియాలిటీ షో : ది ట్రెయిటర్స్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

