అభిమానులకు షాక్ ఇచ్చిన ఏక్తా కపూర్..!
Alt Balaji | ఏక్తా కపూర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. 2017లో ప్రారంభించిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆల్ట్ బాలాజీ (Alt Balaji) బాధ్యతల నుంచి ఏక్తాతో పాటు ఆమె తల్లి శోభా కపూర్ సైతం తప్పుకున్నారు.
Alt Balaji | ఏక్తా కపూర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. 2017లో ప్రారంభించిన ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ఆల్ట్ బాలాజీ (Alt Balaji) బాధ్యతల నుంచి ఏక్తాతో పాటు ఆమె తల్లి శోభా కపూర్ సైతం తప్పుకున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఏక్తా వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫారమ్ ప్రారంభించిన నాటి నుంచి వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆల్ట్ బాలాజీ ఓటీటీ కంటెంట్ మిగితా వాటికన్నా భిన్నంగా ఉండడంతో వరుసగా వార్తలెక్కుతున్నది.
ఈ ఓటీటీలో ప్రసారమైన ‘గందీబాత్’ సిరీస్‌పై వివాదం కోర్టుకు సైతం చేరింది. ‘లాకప్’తో పాటు పలు రియాల్టీ షోలకు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా.. ఆల్ట్ బాలాజీ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఆల్ట్ బాలాజీ కొత్త బృందం ఆధ్వర్యంలో నడుస్తుందని, వివేక్ కోకా కొత్త చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా కొనసాగుతారని ఏక్తా తెలిపింది. ఇతర ప్రాజెక్టులపై దృష్టి పెట్టేందుకు ఏక్తా ఈ నిర్ణయం తీసుకున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

