Dulquer Salmaan | లక్కీ భాస్కర్ కహానీ.. మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్
తండ్రి మమ్ముట్టి తరహాలోనే భాషలకు అతీతమైన నటుడిగా ఎదిగారు దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. దుల్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీభాస్కర్'. వెంకీ అట్లూరి దర్శకుడు.
Dulquer Salmaan | తండ్రి మమ్ముట్టి తరహాలోనే భాషలకు అతీతమైన నటుడిగా ఎదిగారు దుల్కర్ సల్మాన్. మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నారాయన. దుల్కర్ నటిస్తున్న తాజా చిత్రం ‘లక్కీభాస్కర్’. వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.
రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలోని దుల్కర్ ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో ఇందులో దుల్కర్ కనిపిస్తున్నారు. ఒక సాధారణవ్యక్తి, అసాధారణ శక్తిలా ఎలా మారాడు? ఒక మధ్య తరగతి వ్యక్తి, భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు? ఈ క్రమంలో అతని జీవితంలో ఎదురైన పరిణామాలేంటి? ఈ ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా మేకర్స్ ఈ టీజర్‌ని రూపొందించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: నిమిష్ రవి, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. నరేష్‌కు సన్నీ సపోర్ట్ , వెక్కి వెక్కి ఏడ్చిన వర్షిణి!
Asia Cup Rising Stars | భారత్ ఖేల్‌ఖతం.. సెమీస్‌లోనే ఓడిన తిలక్సేన
Gold Price | పసిడి పయనమెటు.. ఈ ఏడాది రూ.55,500 డౌన్.. ఇప్పుడు కొనాలా.. వేచి చూడాలా?
Delimitation Bill | డీలిమిటేషన్‌కు రంగం సిద్ధం.. 30 నుంచి లోక్‌సభ, 2 నుంచి రాజ్యసభ సమావేశాలు
Indiramma Bima | ఇంటి పన్ను కడితేనే ఇందిరమ్మ బీమా.. ములుగు జిల్లా వాజేడులో అధికారుల ఆదేశాలు!
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

