Drugs Case | ‘బేబి’ టీమ్‌కు హైదరాబాద్ సీపీ షాక్..! నోటీసులు ఇస్తామన్న సీవీ ఆనంద్..!
Drugs Case | ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్న చిత్రం బేబి. అయితే, ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు.
Drugs Case | ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ అందుకున్న చిత్రం బేబి. అయితే, ఈ చిత్రం వివాదంలో చిక్కుకున్నది. ఈ చిత్రంపై హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను ప్రోత్సహించేలా చిత్రంలో సీన్లు ఉన్నాయని, డ్రగ్స్‌ను ఏ విధంగా ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారన్నారు. మాదాపూర్‌లోని ఫ్రెష్లివింగ్ అపార్ట్మెంట్లో దాడులు నిర్వహించిన సమయంలో సన్నివేశాలు ‘బేబి’ సినిమాలో ఉన్నాయని తెలిపారు.
సినిమా బృందానికి నోటీసులు ఇవ్వనున్నట్లు పేర్కొన్న ఆయన.. అలాంటి దృశ్యాలను చిత్రీకరించొద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని హెచ్చరించారు. అయితే, మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారన్నారు. మాదాపూర్‌లో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు.
ఓ సంస్థ ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారన్నారు. డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి సైతం ఉన్నారని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా డ్రగ్స్ విక్రయాలు జరుపుతున్నారని, డ్రగ్స్‌కు వినియోగదారుడిగా ఉన్న నవదీప్ పరారీలో ఉన్నారని సీపీ తెలిపారు. అలాగే ఇదే కేసులో మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ను అరెస్ట్ చేశామన్న ఆయన.. నవదీప్ స్నేహితుడు రాంచందర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మరో నిర్మాత కూడా పరారీలో ఉన్నట్లు వివరించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajay Devgn: ఎఫ్‌డీఏ నోటీసును సవాల్ చేస్తూ హైకోర్టుకు అజయ్ దేవగన్
Radhika | నటి రాధిక ఇంట్లో పనిచేసే మహిళ కుమారుడి దారుణ హత్య.. బీచ్‌లో పాతిపెట్టిన స్నేహితులు!
KTR | ఐడీబీఐ బ్యాంక్ ప్రైవేటీకరణపై కేంద్రం తీరుపై కేటీఆర్ ప్రశ్నల వర్షం
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

