థ్రిల్‌ను పంచే ‘దృశ్యం-2’

కుటుంబ అనుబంధాలు, థ్రిల్లర్ అంశాల నేపథ్యంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్‌గా రూపొందిస్తున్న ‘దృశ్యం-2’ చిత్రీకరణ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుతున్నది. వెంకటేష్, మీనా, నదియ, నరేష్, కృతిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీతూజోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని.. క్లీన్ ‘యూ’ సర్టిఫికెట్ లభించిందని చిత్ర బృందం తెలిపింది. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాతలు డి.సురేష్‌బాబు, ఆంటోని పెరంబవూర్, రాజ్‌కుమార్ సేతుపతి తెలిపారు. తొలిభాగం మాదిరిగానే ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు అనుక్షణం ఉత్కంఠగా అనిపించే థ్రిల్లింగ్ అంశాలతో సినిమా ఆకట్టుకుంటుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ కురూప్, సంగీతం: అనూప్‌రూబెన్స్, దర్శకుడు: జీతూ జోసెఫ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Drishyam 2
- meena
- Venkatesh
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

