Dream Girl-2 Movie | అవుట్ అండ్ అవుట్ హిలేరియస్‌గా డ్రీమ్ గర్ల్-2 ట్రైలర్
Dream Girl-2 Trailer | నాలుగేళ్ల కిందట వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమా బాలీవుడ్ నాట నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం రూ. 28కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ రన్లో రూ.150 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది.
Dream Girl-2 Trailer | నాలుగేళ్ల కిందట వచ్చిన డ్రీమ్ గర్ల్ సినిమా బాలీవుడ్ నాట నెలకొల్పిన రికార్డులు అంతా ఇంతా కాదు. కేవలం రూ. 28కోట్ల బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా ఫైనల్ రన్లో రూ.150 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి ఔరా అనిపించింది. ప్రస్తుతం అదే సక్సెస్ ఫార్ములాతో ఆయుష్మాన్ డ్రీమ్ గర్ల్-2తో వస్తున్నాడు. తొలి పార్టును తెరకెక్కించిన రాజ్ శండియాలానే సెకండ్ పార్ట్‌కు కూడా దర్శకత్వ వహించాడు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్లు గట్రా సినిమాపై వీర లెవల్లో అంచనాలు క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
తొలిపార్టులో లేడీ వాయిస్‌తో నవ్వించిన ఆయుష్మాన్ ఈ సారి ఏకంగా లేడీ గెటప్‌తోనే వచ్చాడు. అత్యవసర పరిస్థుతిల్లో లేడీ గెటప్ వేయాల్సి వస్తుంది. ఇక ఆ గెటప్‌ను కంటిన్యూ చేస్తూ మగాళ్లతో ఆడుకునే ఆట వేరే లెవల్లో ఉండబోతుందని ట్రైలర్‌తో స్పష్టమైంది. ట్రైలర్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ రైడ్‌లా సాగింది. లేడీ గెటప్‌లో ఆయుష్మాన్ ఫర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ముఖ్యంగా మురళిధరణ్ సినిమాటోగ్రఫి మాత్రం టాప్ నోట్చ్లో ఉంది. హితేష్ సోనిక్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే ఈ సీక్వెల్లో తొలిపార్టుకు మించి ఫన్ ఉండనున్నట్లు తెలుస్తుంది.
కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆయుష్మాన్‌కు జోడీగా అనన్య పాండే హీరోయిన్గా నటిస్తుంది. బాలాజీ మోషన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఏక్తాకపూర్, శోభా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

