RC16 | ‘ఆర్సీ16’ సెట్స్‌లో జాయిన్ అయిన మున్నాభయ్యా.!
Ram Charan 16 Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
Ram Charan 16 Movie | గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం రామ్ చరణ్ ‘ఉప్పెన’ఫేం బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఆర్సీ16 అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వగా.. మైసూర్లో రామ్ చరణ్‌పై కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు మేకర్స్. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్యగా నటించిన దివ్యేందు శర్మ నటిస్తున్నట్లు చిత్రబృందం ఇంతకుముందే ప్రకటించింది. ఇదిలావుంటే తాజాగా ఆర్సీ16 షూటింగ్ సెట్స్‌లో మున్నాభాయ్య జాయిన్ అయినట్లు తెలుస్తుంది. షూటింగ్ సెట్స్‌లో దివ్యేందు శర్మతో బుచ్చిబాబు దిగిన ఫొటోలను చిత్రబృందం తాజాగా పంచుకుంది. ఇందులో కమెడియన్ నవీన్ కూడా ఉన్నాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి.
మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ పాన్ఇండియా ప్రాజెక్ట్‌లో కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండగా..జాన్వీ కపూర్ కథానాయికగా చేస్తుంది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.
Comedian Naveen from the sets of #RC16 with the director @BuchiBabuSana and #Divyendu AKA Munna Bhai! #RamCharan pic.twitter.com/XUMQJFiQr3
— Telugu Chitraalu (@TeluguChitraalu) January 4, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

