అలా సంబోధించ వద్దు
తెరపై కనిపించేవాళ్లంతా ‘నటీనటులే’ అనీ.. కొందరిని ‘సహ నటులు’ అంటూ సంభోదించడం కరెక్ట్ కాదనీ అంటున్నది బాలీవుడ్ సీనియర్ నటి దివ్యా దత్తా. కేవలం హీరోలతో రొమాన్స్ చేయనంత మాత్రాన.. వారిని తక్కువ చేసి చూడటం సరికాదని చెబుతున్నది.
తెరపై కనిపించేవాళ్లంతా ‘నటీనటులే’ అనీ.. కొందరిని ‘సహ నటులు’ అంటూ సంభోదించడం కరెక్ట్ కాదనీ అంటున్నది బాలీవుడ్ సీనియర్ నటి దివ్యా దత్తా. కేవలం హీరోలతో రొమాన్స్ చేయనంత మాత్రాన.. వారిని తక్కువ చేసి చూడటం సరికాదని చెబుతున్నది. బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి.. దివ్య దత్తా. పరిశ్రమలో ఇచ్చే ‘సపోర్టింగ్ యాక్టర్’ అనే ట్యాగ్‌పై తాజాగా అసంతృప్తి వ్యక్తం చేసింది. తన కొత్త వెబ్ సిరీస్ ‘చిరయ్యా’ విడుదల సందర్భంగా ఓ జాతీయ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది దివ్య. ఈ సందర్భంగా పరిశ్రమలో నటీనటులకు ప్రత్యేకంగా ‘లేబుల్స్’ అంటగట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేసింది.
‘సపోర్టింగ్ యాక్టర్’ అనే పిలుపు తనకు ఏమాత్రం నచ్చదని చెప్పింది. “నేను ఒక నటిని. కాబట్టి, అందరూ నన్ను అలాగే పిలవాలని కోరుకుంటున్నాను. కానీ, కొందరు నటీనటులను లీడ్ యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్ అని వర్గీకరించడం సర్వసాధారణమై పోయింది. హీరోతో రొమాన్స్ చేసే హీరోయిన్ పాత్రలే కాదు.. సినిమాలో ప్రాధాన్యం ఉన్న ప్రతి పాత్రలోనూ కనిపించాలని నేను అనుకుంటాను” అని చెప్పుకొచ్చింది. సినిమాలో కేవలం హీరో చుట్టూ తిరిగే పాత్రలు చేయనంత మాత్రాన.. అది ‘సపోర్టింగ్ క్యారెక్టర్’ ఎలా అవుతుందని ప్రశ్నించింది.
తాను ఎవరికీ సపోర్ట్ చేయడానికి రాలేదనీ, తనకు తానే సపోర్ట్ అనీ పేర్కొన్నది. “సినిమాలో వేసేది ఏ పాత్ర అయినా.. విలన్ అయినా, కమేడియన్ అయినా, ఆ పాత్ర సినిమాను మలుపు తిప్పేదిగా ఉండాలని నేను కోరుకుంటాను. నా సినిమాలు చూస్తే.. ప్రతి దాంట్లోనూ నా పాత్ర ఎంతో కీలకమైనదిగా కనిపిస్తుంది” అని వెల్లడించింది. ఇక పరిశ్రమలోకి వచ్చినవారంతా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఉండాలని ఆరాటపడుతుంటారనీ, తానుమాత్రం భిన్నమైన దారిని ఎంచుకున్నానని తెలిపింది. “నేను ఏ కేటగిరీకి చెందిన నటినో జనానికి తెలియకపోవడమే మంచిది.
అదే నాకిష్టం కూడా! ఎందుకంటే నాకు ఒక ఇమేజ్.. ఒక ట్యాగ్ ఉండటం ఇష్టం లేదు. సినిమాల్లో అన్ని రకాల పాత్రలూ చేయాలని అనుకున్నాను. చేస్తున్నాను కూడా” అంటూ వివరించింది. పంజాబ్‌లో పుట్టి పెరిగిన దివ్యా దత్తా.. బాలీవుడ్‌తోపాటు పంజాబీ పరిశ్రమలోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నది. 1994లో వచ్చిన ‘ఇష్క్ మే జీనా ఇష్క్ మే మర్నా’ చిత్రంతో బీటౌన్‌లో అడుగుపెట్టింది. వీర్‌జారా, భాగ్ మిల్కా భాగ్, ఢిల్లీ-6, బద్లాపూర్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నది. తన తాజా వెబ్‌సిరీస్ ‘చిరయ్యా’తో మరోసారి ఓటీటీ అభిమానులను అలరిస్తున్నది. భారతదేశంలో ‘మారిటల్ రేప్’ అనే అంశం చుట్టూ.. ఈ వెబ్‌సిరీస్ తిరుగుతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ప్రధాని మోదీకి జ్ఞానేశ్‌కుమార్ ఎందుకంత ముఖ్యమో..? : అభిజీత్ దీప్కే
Congress MLA | ఈ గుడి మేము కట్టించాం.. దళితుడితో కాంగ్రెస్ ఎమ్మెల్యే మేనమామ వాగ్వాదం.. వీడియో
‘పట్టణ పరిశుభ్రతలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి’
Water Crisis | నీటి సంక్షోభం.. నీరు వృథా చేస్తే నాగ్‌పూర్‌లో రూ.5,000 ఫైన్.. పూనేలో వారానికోసారి నీళ్లు బంద్
‘పట్టభద్రులు ఓటు నమోదు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

