Sukumar | పుష్ప టైటిల్ కహానీ.. ఆ పేరు ఎందుకు పెట్టానంటే..
‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాలు రెండూ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులను తిరగరాశాయి. పుష్పరాజ్ పాత్ర మాస్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయింది.
Sukumar | ‘పుష్ప’ ఫ్రాంఛైజీ చిత్రాలు రెండూ భారతీయ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాలు దేశవ్యాప్తంగా రికార్డులను తిరగరాశాయి. పుష్పరాజ్ పాత్ర మాస్ ఆడియెన్స్‌కి బాగా కనెక్ట్ అయింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాలో హీరోకి పుష్ప అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందనే విషయం గురించి దర్శకుడు సుకుమార్ ఆసక్తికరమైన వివరాల్ని వెల్లడించారు. తమిళనాడులో జరిగిన ఓ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడారు.
‘పుష్ప’ సినిమాలోని హీరో పుష్పరాజ్ పాత్రను నిజమైన గంధపు చెక్కల స్మగ్లర్ నుంచి స్ఫూర్తిపొంది రూపొందించినట్లు చెప్పారు. ‘ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఓ వెబ్‌సిరీస్ తీద్దామనుకొని పుష్పరాజ్ అనే స్మగ్లర్‌ను కలిశా. నాకెందుకో ఆ పేరు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దాంతో అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అదే పేరుతో సినిమా తీస్తే బాగుంటుందనిపించింది. సాధారణంగా ‘పుష్ప’ అనే పేరు మహిళలకు ఉంటుంది..కానీ ఓ స్మగ్లర్ అలాంటి పేరు పెట్టుకోవడం నన్ను ఆకర్షించింది అని సుకుమార్ తెలిపారు. ప్రస్తుతం సుకుమార్ మాటలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

