Samantha | మీరు ఇస్తూ ఉండండి నేను చేస్తూ ఉంటా!.. సమంతకు సుకుమార్ జీవితకాల ఆఫర్
సమంత గొప్ప నటి. అందులో సందేహం లేదు. మనసుపెట్టి చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటన కనబరిచింది సామ్. ఇటీవల దర్శకుడు సుకుమార్ కూడా సమంతను ప్రశంసలతో ముంచెత్తారు.
Samantha | సమంత గొప్ప నటి. అందులో సందేహం లేదు. మనసుపెట్టి చేసిన ప్రతి సినిమాలో అద్భుతమైన నటన కనబరిచింది సామ్. ఇటీవల దర్శకుడు సుకుమార్ కూడా సమంతను ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు, జీవితకాల అవకాశాన్ని కూడా ఆమెకు ఆఫర్ చేశాడు. వివరాల్లోకెళ్తే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుకుమార్ మాట్లాడుతూ ‘ ‘రంగస్థలం’లో రామలక్ష్మి పాత్రకు ముందు సమంతను అనుకోలేదు. హీరోహీరోయిన్లు ఇద్దరు సూపర్ స్టార్లయితే హ్యాండిల్ చేయలేనేమోనని భయపడ్డాను. అందుకే కొత్తమ్మాయితో చేయిద్దామనుకున్నా. కానీ కొన్ని కారణాల వల్ల సమంతను తీసుకోవాల్సి వచ్చింది. అయితే, లొకేషన్లో ఆమె నటన చూసి ఆశ్చర్యపోయాను.
ఈ రోజు చెబుతున్నాను.. నేను సినిమాలు తీస్తున్నంతకాలం నా ప్రతి సినిమాలో సమంతను ఏదో ఒక పాత్రలో తీసుకుంటూనే ఉంటాను. తనుకు ఏ వయసు వచ్చినా ఆ వయసుకు తగ్గ పాత్ర ఇస్తూనే ఉంటాను.’ అంటూ భారీ ఆఫర్ ఇచ్చేశారు. దీనిపై సమంత కూడా స్పందించారు. ‘థాంక్యూ సుక్కూసార్.. మీరిస్తూ ఉండండి.. నేను చేస్తూనే ఉంటాను’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది సమంత. దీన్నిబట్టి చూస్తే ‘పుష్ప-2’లో కూడా సమంత ఉన్నదని అర్థమవుతున్నది. ‘పుష్ప’లో ‘ఊ అంటావా.. మావా ఊ ఊ అంటావా..’ అంటూ మెరుపులు మెరిపించిన సామ్.. మరి ‘పుష్ప -2’లో ఎలా కనిపించనుందో చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

