అందర్నీ ఆకట్టుకునేలా మోగ్లీ
‘ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఉండే సినిమా ‘మోగ్లీ’. అయిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా నేను చేస్తున్న సినిమా ఇది. అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఆడియన్స్‌కి అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే ఓ ట్విస్ట్ కూడా ఉంది.
‘ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు ఉండే సినిమా ‘మోగ్లీ’. అయిదేళ్ల గ్యాప్ తర్వాత దర్శకుడిగా నేను చేస్తున్న సినిమా ఇది. అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. ఈ సినిమాలో ఆడియన్స్‌కి అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చే ఓ ట్విస్ట్ కూడా ఉంది. చివరికి ఓ బలమైన ఫిలాసఫీని చూపిస్తాం.’ అని దర్శకుడు సందీప్‌రాజ్ అన్నారు. ఆయన దర్శకత్వంలో రోషన్ కనకాల కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘మోగ్లీ 2025’. సాక్షి మడోల్కర్ కథానాయిక. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలు. డిసెంబర్ 12న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం దర్శకుడు సందీప్‌రాజ్ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఇంకా చెబుతూ ‘ఇందులో హీరోహీరోయిన్ల పాత్రలు అందరూ కనెక్టయ్యేలా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో హీరోయిన్ పాత్ర డఫ్ అండ్ డమ్. ఈ తరహా పాత్రను పోషించడం తేలికైన విషయం కాదు. ప్రేమకు భాష లేదనే విషయాన్ని చెప్పేందుకే ఆ పాత్రను అలా డిజైన్ చేశాను. సాక్షి ఆ పాత్రను అద్భుతంగా పోషించింది. ఇక రోషన్ పాత్రలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయి. ఓ వైపు అమాయకుడిగా, మరోవైపు స్ట్రాంగ్‌గా కనిపిస్తాడు.
అద్భుతంగా నటించాడు. ప్రథమార్ధం అంతా ఫన్నీగా, ఆద్యంతం నవ్వించేలా సినిమా ఉంటుంది.’ అని తెలిపారు సందీప్‌రాజ్. బండి సరోజ్ ఇందులో విలన్‌గా నటించారని, ఆయన పాత్ర కొత్తగా ఉంటుందని, అంతా షాక్ అవుతారని, ఈ సినిమాకు అద్భుతమైన టీమ్ సెట్ అయ్యిందని సందీప్‌రాజ్ పేర్కొన్నారు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుందని, నిర్మాతలు ఏ విషయంలోనూ రాజీ పడలేదని, వచ్చే నెల 12న రానున్న మోగ్లీ అందరికీ నచ్చుతుందని సందీప్‌రాజ్ నమ్మకం వెలిబుచ్చారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో పీవీ సింధు ఓటమి.. టైటిల్ గెలుచుకున్న వరల్డ్ నెంబర్ వన్ అన్ సె యంగ్
KTR | రాహుల్‌గాంధీకి తెలంగాణ ఒక ఏటీఎంగా మారింది : కేటీఆర్
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

