Puri Jagannath | ఆ ఫోన్‌కాల్‌తో ఎమోషనల్ అయ్యాను: పూరి జగన్నాథ్
మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ కావు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే రామ్ ఎనర్జీ గురించే మాట్లాడాలి. రామ్ సెట్లో అడుగుపెట్టగానే ఏదో శక్తి వస్తుంది.
‘మీ ఊరు రాకుండా మిమ్మల్ని కలవకుండా మా సినిమాలు రిలీజ్ కావు. ఈ సినిమా గురించి మాట్లాడాలంటే రామ్ ఎనర్జీ గురించే మాట్లాడాలి. రామ్ సెట్లో అడుగుపెట్టగానే ఏదో శక్తి వస్తుంది. అద్భుతమైన డ్యాన్స్, తెలంగాణ యాసతో తన పాత్రను రక్తికట్టించాడు. రామ్ లేకపోతే ఈ సినిమా లేదు’ అన్నారు పూరి జగన్నాథ్. ఆయన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన ‘డబుల్ ఇస్మార్ట్’ ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. పూరి కనెక్ట్స్ పతాకంపై పూరి జగన్నాథ్, ఛార్మికౌర్ నిర్మించారు. ఆదివారం హన్మకొండలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ హీరో రామ్ ‘ఇస్మార్ట్‌శంకర్’ కంటే డబుల్ఎనర్జీతో ఈ సినిమా చేశారు.
నా సినిమా ఒకటి ఫ్లాప్ అయినప్పుడు రచయిత విజయేంద్రప్రసాద్‌గారు ఫోన్ చేసి ‘సర్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా’ అనడిగారు. ఆయన కొడుకే పెద్ద డైరెక్టర్.. నేను చేసే హెల్ప్ ఏముంటుందని అనుకున్నా. ‘మీరు నెక్ట్స్ సినిమా చేసే ముందు కథ చెబుతారా? ఏమైనా చిన్న మార్పులుంటే సూచిస్తాను. ఎందుకంటే మీలాంటి డైరెక్టర్స్ ఫెయిల్యూర్ అయితే నేను చూడలేను’ అన్నారు. ఆ రోజు నేను చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యా. అందుకే ఒళ్లు దగ్గర పెట్టుకొని ఈ సినిమా చేశా. మా టీమ్ అందరికి ఓ బ్లాక్‌బస్టర్ అవసరం. ఈ సినిమాతో అది దక్కుతుందని ఆశిస్తున్నా’ అన్నారు.
హీరో రామ్ మాట్లాడుతూ ‘ఐదేళ్ల తర్వాత మళ్లీ వరంగల్‌కు వచ్చాను. ఇప్పటికీ కూడా తెలుగు ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ మోస్ట్ ఇన్స్పైరింగ్ డైరెక్టర్. కొత్త దర్శకులు ఆయన స్ఫూర్తితో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. నా ఫోన్ కాంటాక్ట్‌లో పూరిగారి పేరును ‘గన్’ అని పెట్టుకున్నా. ఎందుకంటే హీరోలు బుల్లెట్ల లాంటివారు. పేల్చే గన్ కరెక్ట్‌గా ఉంటే బుల్లెట్ పర్ఫెక్ట్గా వెళుతుంది. పూరి లాంటి గన్ ప్రతి యాక్టర్‌కి అవసరం. ఇక ఏ విషయమైనా ముందు మనకు నచ్చిందో లేదో తెలుసుకోవాలి. అది సినిమా అయినా బిర్యానీ అయినా పక్కోడి ఒపీనియన్ గురించి పట్టించుకోవద్దు. నేను జనరల్‌గా సలహాలు ఇవ్వను. కానీ మీరంతా నా మనుషులే అని భావించి ఇచ్చాను’ అన్నారు. ‘డబుల్ ఇస్మార్ట్’ పాటలు, ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించిందని, సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నామని ఛార్మి తెలిపింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

