Organic Mama-Hybrid Alludu | నేటి యువతకు సందేశం
సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ-హైబ్రీడ్ అల్లుడు’. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోనేరు కల్పన నిర్మాత.
సోహైల్, మృణాళిని జంటగా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘ఆర్గానిక్ మామ-హైబ్రీడ్ అల్లుడు’. రాజేంద్రప్రసాద్, మీనా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కోనేరు కల్పన నిర్మాత. ఈ చిత్రంలోని ‘నమ్ముకోరా..నమ్ముకోరా..’ అంటూ సాగే సెకండ్ సింగిల్‌ను దర్శకుడు గోపీచంద్ మలినేని గురువారం విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి రచించిన ఈ గీతాన్ని రేవంత్ ఆలపించారు. ఈ సందర్భంగా దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ‘ఇదొక యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఆద్యంతం చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఈ సినిమా కోసం తొలిసారి సంభాషణలు రాశాను. రాజేంద్రప్రసాద్, మీనా నటన ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. ‘కృష్ణారెడ్డిగారి సినిమాల్లో ఫ్యామిలీ డ్రామాతో పాటు చక్కటి మెసేజ్ కూడా ఉంటుంది.
ఈ సినిమా ద్వారా నేటి యువతకు మంచి సందేశాన్నిచ్చాం. యూత్ ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ పాటను ప్రత్యేకంగా రాయించాం. మార్చిలో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని చిత్ర సమర్పకుడు కె.అచ్చిరెడ్డి తెలిపారు. దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారని, తప్పకుండా ప్రేక్షకుల ఆదరణ పొందుతారని నిర్మాత సి.కల్యాణ్ పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

