వెంకట్ కళ్యాణ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘చెడ్డీ గ్యాంగ్ తమాషా’. గాయత్రి పటేల్ నాయికగా నటిస్తున్నది. ఈ చిత్రాన్ని అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సీహెచ్. క్రాంతి కిరణ్ నిర్మాత. ఈ సినిమా ఫస్ట్ లుక్ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఫస్ట్ లుక్ బాగుందన్న ఆయన చిత్ర బృందానికి విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ..‘క్రైమ్ థ్రిల్లర్ జానర్లో కొత్త తరహా చిత్రమిది. షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జీకే యాదవ్, సంగీతం : అర్జున్ నల్లగొప్పుల.