రాహుల్ హ్యాట్రిక్ హిట్ కొట్టాడు
‘సినిమాను అమితంగా ప్రేమించే రాహుల్ వంటి నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు. అతను తీసిన రెండు చిత్రాల్ని చూశాను.
‘సినిమాను అమితంగా ప్రేమించే రాహుల్ వంటి నిర్మాతలు చాలా తక్కువ మంది ఉంటారు. అతను తీసిన రెండు చిత్రాల్ని చూశాను. చాలా కొత్తగా అనిపించాయి. ‘మసూద’ చిత్రంతో రాహుల్ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు’ అని చెప్పారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ చిత్రం ‘మసూద’. సాయికిరణ్ దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా నిర్మాత. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శనివారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ ‘సినిమా బాగా లేకపోతే ఎవరూ ఏమీ చేయలేరు. కానీ ఈ సినిమా చాలా బాగుంది. అందుకే సపోర్ట్ చేస్తున్నా. ఒక మంచి సినిమాను బతికిద్దాం. ఎంతో పాషన్‌తో రాహుల్ ఈ సినిమా తీశాడు. థియేటర్లో చూసి థ్రిల్ ఫీల్ కావాల్సిన చిత్రమిది’ అన్నారు. ‘ఎవరికైనా సహాయం చేయడానికి ఎలాంటి కారణం అవసరం లేదనే కథలోని సందేశం నచ్చి ‘మసూద’ చిత్రాన్ని తీశాను. వాణిజ్య పంథాలో కాకుండా ఓ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకుల్ని అందించాలని ప్రయత్నించా’ అని నిర్మాత రాహుల్ యాదవ్ తెలిపారు. సంగీత మాట్లాడుతూ ‘ఇలాంటి హారర్ సినిమాలు ఇంట్లో చూస్తే థ్రిల్ రాదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్..ఇలా ప్రతి విషయంలో థ్రిల్నిస్తుందీ చిత్రం. అందరూ థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలని కోరుతున్నా’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

