Sara Arjun | బాలీవుడ్ నటి, ‘ధురంధర్’ ఫేమ్ సారా అర్జున్ శనివారం మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో కొలువైన శ్రీ మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు. ఉదయం ఉజ్జయిని మహాకాళేశ్వరుడి ఆలయానికి చేరుకున్న ఆమెకి ఆలయ సిబ్బంది ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక సారా మహాకాళేశ్వరుడిని దర్శించుకోవడంతో పాటు స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన భస్మ హారతి సేవలో పాల్గోంది.
ఈ పవిత్ర ఆధ్యాత్మిక యాత్ర ముగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తనకు మాటలు రావడం లేదని, స్వామివారి పిలుపు రావడం వల్లే తాను ఇక్కడికి రాగలిగానని తెలిపారు. ప్రపంచంలో దీనిని మించిన గొప్ప అనుభూతి మరొకటి లేదని, ఈ పర్యటన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
మహాకాళేశ్వర ఆలయంలో జరిగే క్రతువుల్లో భస్మ హారతికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతిరోజూ తెల్లవారుజామున 3:30 నుండి 5:30 గంటల మధ్య బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజను నిర్వహిస్తారు. ఆలయ తలుపులు తీసిన వెంటనే స్వామివారికి పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతో కూడిన పంచామృత అభిషేకం చేస్తారు. అనంతరం గంధం, ఇతర సుగంధ ద్రవ్యాలతో అలంకరించి, మంత్రోచ్చారణలు, శంఖ నాదాలు, డప్పు వాయిద్యాల మధ్య భస్మ హారతిని కన్నుల పండువగా జరుపుతారు. ఇక హిందూ ధర్మంలోని 12 జ్యోతిర్లింగాలలో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఒకరిగా పూజలందుకుంటున్నారు. ఈ భస్మ హారతిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అందుకే దేశవిదేశాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి తరలివస్తుంటారు.
#WATCH | Madhya Pradesh: Actor Sara Arjun attended Bhasma Aarti at Shree Mahakaleshwar Temple in Ujjain, today. pic.twitter.com/HbNhKcCavC
— ANI (@ANI) April 11, 2026