పొగరు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు కన్నడ యాక్టర్ ధ్రువ సర్జా (Dhruva Sarja). ఈ యువ హీరో ప్రస్తుతం కేడీ-ది డెవిల్ (KD- The Devil) సినిమాలో నటిస్తున్నాడు. ధ్రువ సర్జా ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నాడు. తాను 23 కిలోలు బరువు తగ్గినట్టు చెబుతూ న్యూ లుక్ను షేర్ చేశాడు.
ఈ టాలెంటెడ్ యాక్టర్ కేడీ-ది డెవిల్ కోసం కేవలం నెల గ్యాప్లోనే ఇంతలా బరువు తగ్గడం గమనార్హం. కేడీకి ముందు.. తర్వాత అంటూ నెట్టింట షేర్ చేసిన స్టిల్స్ ఇపుడు ట్రెండింగ్ అవుతున్నాయి. కేడీ సినిమా కోసం ధ్రువ్ ఎంతలా శ్రమించాడో ఈ ఒక్క లుక్తో అర్థమవుతుంది. తన కొత్త సినిమా విజయాన్ని సాధించేందుకు అందరి ఆశీస్సులు కావాలని కోరాడు ధ్రువ సర్జా.
కన్నడలో ఆర్ఆర్ఆర్ను పంపిణీ చేసిన కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. షోమ్యాన్ ప్రేమ్స్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అర్జున్ జన్య సంగీతం అందిస్తున్నారు. కన్నడతోపాటు వివిధ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో చెబుతోంది.
కేడీ ది డెవిల్ టైటిల్ టీజర్..