Dhanush | తండ్రి దర్శకత్వంలో కొడుకు ఎంట్రీ.. ధనుష్ వారసుడిగా యాత్ర హీరోగా గ్రాండ్ లాంచ్?
Dhanush | తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ప్రాజెక్టులు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో, ఫిల్మ్‌మేకర్‌గా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
Dhanush | తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమలో అత్యంత బిజీగా ఉన్న నటుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటుకుంటున్నారు. ఇటీవల ఆయన దర్శకత్వం వహించిన ప్రాజెక్టులు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకోవడంతో, ఫిల్మ్‌మేకర్‌గా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇలాంటి సమయంలో ధనుష్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తన పెద్ద కుమారుడు యాత్రను హీరోగా పరిచయం చేసేందుకు ధనుష్ సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే స్టార్ కిడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన యాత్ర త్వరలోనే వెండితెరపై అడుగుపెట్టనున్నాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
విశేషమేమిటంటే, ఈ ప్రాజెక్ట్‌ను స్వయంగా ధనుష్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం. తన కుమారుడి తొలి చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని ఆయన భావిస్తున్నారట. కథ, పాత్ర, ప్రెజెంటేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ యాత్రకు గుర్తుండిపోయే డెబ్యూ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ధనుష్ సొంత నిర్మాణ సంస్థ ‘వుండర్‌బార్ ఫిల్మ్స్’తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ ‘ఆర్‌టేక్ స్టూడియోస్’ సంయుక్తంగా నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రాథమిక చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
ఇక యాత్ర ప్రస్తుతం నటన, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నాడట. హీరోగా పరిచయం కావడానికి అవసరమైన అన్ని అంశాల్లో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అలాగే త్వరలోనే ఒక ప్రత్యేక టెస్ట్ షూట్ నిర్వహించి, కెమెరా ముందు యాత్ర ప్రదర్శనను అంచనా వేయనున్నారని సమాచారం.ధనుష్ ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసిన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కోలీవుడ్‌లో ఈ సినిమా గురించి ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. సాంకేతిక విభాగం కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. ధనుష్-జి.వి. ప్రకాష్ కాంబినేషన్లో గతంలో వచ్చిన పలు చిత్రాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలవడంతో ఈ వార్త అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అలాగే ప్రముఖ సినిమాటోగ్రాఫర్ వేల్రాజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించనున్నట్లు సమాచారం. ధనుష్ కెరీర్‌లోని ఎన్నో విజయవంతమైన చిత్రాలకు వేల్రాజ్ పనిచేయడం విశేషం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

