Dhamaka Movie | పల్సర్ బైక్ సాంగ్‌కు తగ్గని క్రేజ్..!
Pulsar Bike Song | గతేడాది డిసెంబర్ విడుదలైన ధమాకా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై ఏమంత బజ్ ఏర్పడలేదు. చూసిన కథనే మళ్లీ చూపిస్తున్నారనే ప్రేక్షకులు ఫిక్సయిపోయారు.
Pulsar Bike Song | గతేడాది డిసెంబర్ విడుదలైన ధమాకా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. టీజర్, ట్రైలర్లతో ఈ సినిమాపై ఏమంత బజ్ ఏర్పడలేదు. చూసిన కథనే మళ్లీ చూపిస్తున్నారనే ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ఇక కొందరైతే సినిమా షెడ్‌కు పోయినట్లు అని కామెంట్స్ చేశారు. కట్ చేస్తే వంద కోట్ల బొమ్మ అయింది. రవితేజ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమా వంద కోట్ల కలెక్షన్లు సాధించిందంటే మాములు విషయం కాదు. శ్రీలీల అందాలకు, డ్యాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ సంగీత దర్శకుడు భీమ్స్‌కే ఇవ్వాలి.
ఈ సినిమా పాటలు ఒకదానికి మించి మరొకటి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. మొత్తంగా ఆల్భమే హైలేట్. చాలా కాలం తర్వాత ఒక సినిమాలో అన్ని పాటలు చక్కగా కుదిరాయంటే అది ఈ సినిమాకు మాత్రమే. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలకు థియేటర్లో ఒక్కరు కూడా సీట్లలో కూర్చోలేరు. రవితేజ, శ్రీలీలతో పాటుగా కాళ్లు కదిపారు. ఈలలు, గోలలతో రచ్చ లేపారు. ముఖ్యంగా పల్సర్ బైక్ సాంగ్‌కు థియేటర్లో అభిమానులు చేసిన గోల అంతా ఇంతా కాదు. ఆల్రెడీ విన్న పాటే అయినప్పటికి భీమ్స్ తన స్టైల్ ఆఫ్ మిక్సింగ్, సౌండ్ డిజైన్‌తో ఓ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు. దానికి ఏ మాత్రం తగ్గకుండా రవితేజ, శ్రీలీల డ్యాన్స్‌లు ఇరగదీశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుల్లో ఈ పాటను గుర్తు చేసుకోని వారు లేరు. అంతలా ఈ పాట ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ పాట 80మిలియన్ల వ్యూస్‌ను సాధించింది. అంటే ఎనిమిది కోట్ల మంది ఈ పాటను వీక్షించారు. ఈ సాంగ్ రిలీజై మూడు నెలలవుతున్నా ఇంకా దీని జోరు తగ్గడం లేదు. ఇక ఇదే సినిమాలోని జింతాక్ సాంగ్‌కు వంద కోట్ల మిలియన్ల వ్యూస్ వచ్చాయి. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది.
Most Loved
& Celebrated#PulsarBike Video song celebrates
8️⃣0️⃣MN+..Views & Trending 💥🤩#DhamakaWatch Full Video Song 👇https://t.co/8mRBUEJIVr@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada@sujithkolli pic.twitter.com/syZBBdlTrv
— People Media Factory (@peoplemediafcy) May 2, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

