Dhamaka Movie | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న పల్సర్ బైక్ సాంగ్
Pulsar Bike Song | ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ధమాకాతో తిరగులేని కంబ్యాక్ ఇచ్చాడు మాస్ మహరాజా రవితే. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్ల కూడా సినిమాపై అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి.
Pulsar Bike Song | ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ వంటి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల తర్వాత ధమాకాతో తిరగులేని కంబ్యాక్ ఇచ్చాడు మాస్ మహరాజా రవితే. రిలీజ్‌కు ముందు ఈ సినిమాపై పెద్దగా బజ్ లేదు. టీజర్, ట్రైలర్ల కూడా సినిమాపై అంతగా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. చూసిన కథనే మళ్లీ చూపిస్తున్నారనే ప్రేక్షకులు ఫిక్సయిపోయారు. ఇక కొందరైతే సినిమా షెడ్‌కు పోయినట్లు అని కామెంట్స్ చేశారు. కట్ చేస్తే వంద కోట్ల బొమ్మ అయింది. రవితేజ కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. తొలిరోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమా వంద కోట్ల కలెక్షన్లు సాధించిందంటే మాములు విషయం కాదు. శ్రీలీల అందాలకు, డ్యాన్స్‌లకు ప్రేక్షకులు వెర్రెత్తిపోయారు. రవితేజ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్కు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా సక్సెస్‌లో సగం క్రెడిట్ సంగీత దర్శకుడు భీమ్స్‌కే ఇవ్వాలి.
ఈ సినిమా పాటలు ఒకదానికి మించి మరొకటి చార్ట్ బస్టర్‌గా నిలిచింది. మొత్తంగా ఆల్భమే హైలేట్. చాలా కాలం తర్వాత ఒక సినిమాలో అన్ని పాటలు చక్కగా కుదిరాయంటే అది ఈ సినిమాకు మాత్రమే. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలకు థియేటర్లో ఒక్కరు కూడా సీట్లలో కూర్చోలేరు. రవితేజ, శ్రీలీలతో పాటుగా కాళ్లు కదిపారు. ఈలలు, గోలలతో రచ్చ లేపారు. ముఖ్యంగా పల్సర్ బైక్ సాంగ్‌కు థియేటర్లో అభిమానులు చేసిన గోల అంతా ఇంతా కాదు. ఆల్రెడీ విన్న పాటే అయినప్పటికి భీమ్స్ తన స్టైల్ ఆఫ్ మిక్సింగ్, సౌండ్ డిజైన్‌తో ఓ రేంజ్లో మ్యూజిక్ ఇచ్చాడు. దానికి ఏ మాత్రం తగ్గకుండా రవితేజ, శ్రీలీల డ్యాన్స్‌లు ఇరగదీశారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుల్లో ఈ పాటను గుర్తు చేసుకోని వారు లేరు. అంతలా ఈ పాట ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
తాజాగా ఈ పాట వంద మిలియన్ల వ్యూస్ సాధించింది. అంటే ఇప్పటివరకు ఈ పాటను పది కోట్ల మంది వీక్షించారు. ఈ సాంగ్ రిలీజై మూడు నెలలవుతున్నా ఇంకా దీని జోరు తగ్గడం లేదు. ఏ ఫంక్షన్లో చూసిన ఈ పాటే. ఇక బరాత్‌లో ఈ పాట ఖచ్చితంగా ఉండాల్సిందే. అంతలా పల్సర్ బైక్ సాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇక ఇదే సినిమాలోని జింతాక్ సాంగ్ ఇప్పటికే వంద మిలియన్ల వ్యూస్ దాటేసింది. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ సినిమాను పీపుల్ మీడియా సంస్థ నిర్మించింది.
#PulsarBike Records are unstoppable 🔥
Pulsarbike video song celebrates 1️⃣0️⃣0️⃣MN+..record breaking Views & Trending 💥🤩#DhamakaWatch Full Video Song 👇https://t.co/8mRBUEJIVr@RaviTeja_offl @sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @vivekkuchibotla @KumarBezwada… pic.twitter.com/RHkiZuTMhy
— People Media Factory (@peoplemediafcy) May 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

