e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home News Dhamaka: ర‌వితేజ ఫుల్ స్పీడ్ మీదున్నాడుగా.. తాజా చిత్ర షెడ్యూల్ కూడా పూర్తైంది..!

Dhamaka: ర‌వితేజ ఫుల్ స్పీడ్ మీదున్నాడుగా.. తాజా చిత్ర షెడ్యూల్ కూడా పూర్తైంది..!

మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ మంచి జోరుమీదున్నాడు.వ‌రుస సినిమాలు చేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. ఇప్ప‌టికే క్రాక్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన ర‌వితేజ ఇప్పుడు ఖిలాడి చిత్రాన్ని త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడు. మీనాక్షి చౌద‌రి, డింపుల్ హ‌యాతి హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. దేవిశ్రీప్ర‌సాద్ సోద‌రుడు సాగ‌ర్ ఈ చిత్రానికి మాట‌ల‌ను అందిస్తున్నాడు. హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై స‌త్య‌నారాయ‌ణ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్ర‌స్తుతం రామారావు ఆన్‌డ్యూటీ అనే చిత్రంతో పాటు ధ‌మాకా అనే చిత్రాలు చేస్తున్నాడు ర‌వితేజ‌. హిట్ దర్శకుడు త్రినాథ రావు నక్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుండ‌గా, తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు సమాచారం. ఫ‌స్ట్ షెడ్యూల్ ఇంత స్పీడ్‌గా కంప్లీట్ చేయ‌డంపై అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇందులో ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement