Dhamaal 4 | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన తాజా కామెడీ ఎంటర్టైనర్ ‘ధమాల్ 4’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. విమర్శకుల నుంచి ఆశించిన స్థాయిలో ప్రశంసలు రాకపోయినా, ప్రేక్షకుల నుంచి మాత్రం సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే కలెక్షన్ల రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రెండో శుక్రవారం కూడా ఈ సినిమా నిలడగా వసూళ్లు సాధించింది. దీంతో భారత్లో రూ.100 కోట్ల నెట్ కలెక్షన్ల మైలురాయిని విజయవంతంగా అందుకుంది. రెండో శుక్రవారం వసూళ్లలో పెద్దగా తగ్గుదల లేకపోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వీకెండ్లో ఈ సినిమా మరింత భారీ వసూళ్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటీవలి కాలంలో విడుదలైన పలువురు బాలీవుడ్ స్టార్ హీరోల చిత్రాలు త్వరగా బాక్సాఫీస్ వద్ద జోరు కోల్పోయినా, ‘ధమాల్ 4’ మాత్రం అలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం లేదు. ముఖ్యంగా ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ విడుదలయ్యే వరకు పెద్ద పోటీ లేకపోవడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మంచి అవకాశం లభించనుంది.
ప్రముఖ దర్శకుడు ఇంద్ర కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అజయ్ దేవగణ్తో పాటు అర్షద్ వార్సీ, రితేష్ దేశ్ముఖ్, అంజలి ఆనంద్, సంజీదా షేక్, సంజయ్ మిశ్రా, రవి కిషన్ కీలక పాత్రల్లో నటించారు. కామెడీ, ఎంటర్టైన్మెంట్ ప్రధాన బలంగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను విశేషంగా ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.