కల్యాణ్‌రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ఉపశీర్షిక. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో అభిషేక్ నామా తెరకెక్కిస్తున్నారు. సోమవారం ఈ సినిమాలోని ‘దిస్ ఈజ్ లేడీ రోజ్’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరపరచిన ఈ పాటను రాజకుమారి ఆలపించింది. బాలీవుడ్ భామ ఎల్నాజ్ నొరౌజీ ఈ ప్రత్యేకగీతంలో హీరో కల్యాణ్‌రామ్‌తో ఆడిపాడింది. ‘పీరియాడిక్ స్పై థ్రిల్లర్ ఇది. కల్యాణ్ రామ్ బ్రిటీష్ గూఢచారిగా కనిపిస్తారు. ఆయన పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: సౌందర్ రాజన్, స్క్రీన్‌ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా.