NTR Neel | యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం నుంచి ఎట్టకేలకు ఒక భారీ అప్డేట్ వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) పురస్కరించుకుని, మేకర్స్ అభిమానుల కోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఈ రోజు అర్థరాత్రి సరిగ్గా 11:52 గంటలకి ఈ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్స్ (First Glimpse) డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌తో పాటు, ఎంపిక చేసిన థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి “డ్రాగన్” (Dragon) అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో గట్టి టాక్ వినిపిస్తోంది. సెన్సార్ బోర్డ్ (CBFC) వెబ్సైట్లో కూడా ‘గ్లింప్స్ ఆఫ్ డ్రాగన్’ పేరుతో సర్టిఫికేట్ పొందినట్లు సమాచారం రావడంతో అభిమానుల్లో అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ రాత్రి గ్లింప్స్ ద్వారా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
సాధారణంగా వచ్చే టీజర్లు లేదా గ్లింప్స్‌లు ఒకటి లేదా రెండు నిమిషాలు మాత్రమే ఉంటాయి. కానీ, ప్రశాంత్ నీల్ ఈసారి భిన్నంగా ఏకంగా 4 నిమిషాల 35 సెకన్ల రన్ టైమ్‌తో ఈ గ్లింప్స్‌ను కట్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా యొక్క కథా నేపథ్యాన్ని, ఆ ప్రపంచాన్ని (World Building) ప్రేక్షకులకు పరిచయం చేయడం కోసమే ఇంత సుదీర్ఘమైన విజువల్స్‌ను ప్లాన్ చేశారట. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ హై బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్లో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ‘కేజీఎఫ్’, ‘సలార్’ చిత్రాలకు ఊపిరి పోసిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ క్రేజీ పాన్-ఇండియా విజువల్ వండర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ రాత్రి విడుదల కాబోతున్న విజువల్స్ టాలీవుడ్ రికార్డులను ఏ స్థాయిలో తిరగరాస్తాయో చూడాలి!
These are the grounds where the destruction protocol activates 🔥#NTRNeel First Glimpse today at 11:52PM IST. pic.twitter.com/xs9SeBLvBp
— #NTRNeel (@NTRNeelFilm) May 19, 2026