బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణే రీసెంట్గా కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి ఫరా ఖాన్‌తో కలిసి హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు పలు విషయాలు అమితాబ్‌తో షేర్ చేసుకోగా, అవి తెగ వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనె 2014లో తీవ్రమైన డిప్రెషన్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పలు సందర్భాలలోచెప్పుకొచ్చింది. తాజాగా మరో సారి వివరించింది.
డిప్రెషన్లో ఉన్న సమయంలో నాకు అంత చిరాకుగా ఉండేది. ఎవరితో కలవాలని అనిపించేది కాదు. నలుగురితో కలవకుండా ఒంటరిగా ఉండేదాన్ని. చాలా సందర్భాల్లో ఏమీ చేయలేకపోతున్నా ఎందుకు బతకడం అనిపించేది. ఆ సమయంలో చనిపోదామనుకున్నా. నా పరిస్థితిని చూసి మా అమ్మ సైకియార్టిస్ట్ దగ్గరకు తీసుకెళ్లింది. కొన్ని నెలల పాటు చికిత్స తీసుకున్న తర్వాత డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’అని దీపికా ఎమోషనల్ అయింది.
తను అనుభవించిన బాధ ఎవరు అనుభవించకూడదని భావించిన దీపికా.. ‘లివ్ లవ్ లాఫ్’ఫౌండేషన్ స్థాపించింది. దీని ద్వారా డిప్రెషన్లో ఉన్న చాలా మంది కోలుకునేలా చేసింది. అయితే దీపికా డిప్రెషన్లో ఉన్న సమయంలోనే ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రంలో నటించిందని, షూటింగ్ సమయంలో ఒక్క శాతం కూడా బాధపడుతున్నట్టు కనిపించలేదని ఫరా ఖాన్ చెప్పింది.