Rachita Ram | దర్శన్ నాకు గురువు లాంటి వారు కానీ.. నటి రచితా రామ్ ఏమన్నదంటే..?
Rachita Ram | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి రచితా రామ్ ఈ వ్యవహారంపై స్పందించింది.
Rachita Ram | పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan)ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేయడం కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి అనే వ్యక్తి హత్యకు సంబంధించిన కేసులో దర్శన్‌తోపాటు నటి పవిత్రగౌడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నటి రచితా రామ్ (Rachita Ram) ఈ వ్యవహారంపై స్పందించింది.
సాధారణ పౌరురాలిగా తన స్పందనను అందరితో పంచుకుంది. రేణుకాస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి మనోధైర్యాన్ని అందించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నా. హత్య కేసులో సరైన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానంది. దర్శన్ గురించి మాట్లాడుతూ.. తనను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన దర్శన్ తనకు గురువు లాంటి వారని చెప్పింది.
దర్శన్ తనకు ఎప్పుడూ పాజిటివ్‌గా మార్గనిర్దేశం చేసేవారని, ఆయన ఇలాంటి హత్య కేసులో ఉన్నారంటే నమ్మశక్యం కావడం లేదంది రచితా రామ్. పోలీసుల విచారణలో నిజానిజాలు బయటకు వస్తాయని, మీడియా ఈ కేసును ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా రిపోర్టు చేస్తుందని నమ్ముతున్నానని ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది రచితా రామ్. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులుండగా.. కొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

