Renukaswamy Case | రేణుకాస్వామి హత్యకేసుపై హోంమంత్రి పరమేశ్వర కీలక వ్యాఖ్యలు..!
Renuka Swami Case | రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే చార్జిష్టీ దాఖలు చేస్తామని సోమవారం స్పష్టం చేశారు. హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, హీరోయిన్ పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది నిందితులుగా ఉన్నారు.
Renukaswamy Case | రేణుకాస్వామి హత్య కేసులో కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే చార్జిష్టీ దాఖలు చేస్తామని సోమవారం స్పష్టం చేశారు. హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ తూగుదీప, హీరోయిన్ పవిత్ర గౌడతో పాటు మరో 15 మంది నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం నిందితులందరికీ జూలై 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ క్రమంలో హోమంత్రి స్పందిస్తూ ‘నిందితులను అరెస్టు చేశారు. దర్యాప్తు కొనసాగుతున్నది. సాక్ష్యాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఆ తర్వాత మాత్రమే చార్జిషీట్ దాఖలు చేస్తారు’ అని పేర్కొన్నారు. ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ.. ఇంకా విధివిధానాలు ఉన్నాయని.. కేసులో తగిన ఆధారాలు సేకరించాకే చార్జిషీట్ వేస్తామన్నారు.
ఈ కేసులో ఎవరినీ కాపాడాల్సిన అవసరం లేదని.. అలా జరగదని ముందే చెప్పానన్నారు. పవిత్ర గౌడకు వచ్చిన మెస్సేజ్‌లు నటుడు దర్శన్ కోపం తెప్పించాయని.. దాంతో రేణుకస్వామి హత్యకు గురయ్యారన్నారు. ఇదిలా ఉండగా.. చిత్రదుర్గకు చెందిన రేణుకస్వామి మృతదేహం జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్మెంట్ పక్కనే ఉన్న డ్రెయినేజీ వద్ద లభ్యమైంది. జూన్ 8న దర్శన్ అభిమాన సంఘానికి చెందిన రాఘవేంద్ర అనే నిందితుడు.. హీరో దర్శన్ కలవాలనుకుంటున్నాడని రేణుకస్వామికి ఫోన్ చేశాడు. ఆ తర్వాత రేణుకస్వామి హత్యకు గురయ్యాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం.. రేణుకస్వామి తీవ్రగాయాలు, రక్తస్రావం కారణంగా మృతి చెందాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

