Nitish Kumar Hijab Row | డాక్టర్ హిజాబ్‌ను లాగిన బీహార్ సీఎం.. నితిష్ చర్యపై మండిపడ్డ ‘దంగల్’ నటి
Nitish Kumar Hijab Row | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
Nitish Kumar Hijab Row | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar) మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. పాట్నాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ మహిళా డాక్టర్ హిజాబ్‌ను (Hijab) దించి, ఆమె ముఖాన్ని చూడటంపై విమర్శలు వస్తున్నాయి. ఆయుష్ డాక్టర్లకు సర్టిఫికెట్ల ప్రదానం సందర్భంగా సోమవారం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై ఇప్పటికే కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్రంగా స్పందించాయి. ఆర్జేడీ అధికార ప్రతినిధి ఎజాజ్ అహ్మద్ స్పందిస్తూ, మహిళల పట్ల బీజేపీ-జేడీయూ కూటమి వైఖరి స్పష్టమవుతున్నదన్నారు. ఈ చర్య ఓ వ్యక్తికి గల మత, సంస్కృతిపరమైన స్వేచ్ఛతో జీవించే హక్కును లాక్కోవడమేనని ఆరోపించారు. నితీశ్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. నితీశ్ కుమార్ మానసిక స్థితిని ఆర్జేడీ ప్రశ్నించింది.
ఇదిలావుంటే ఈ వివాదంపై తాజాగా దంగల్ నటి జైరా వాసిమ్ స్పందిస్తూ నితిష్ చర్యను ఖండించింది. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఒక మహిళ గౌరవం, ఆమె నిరాడంబరతతో ఆడుకోవడానికి అవి ఆట వస్తువులు కావు. ముఖ్యంగా ప్రజా వేదికపై అయితే అస్సలు కాదు. ఒక ముస్లిం మహిళగా, మరో మహిళ నిఖాబ్‌ను (Niqab) అంత తేలిగ్గా లాగివేయడం, దానికి తోడు ఆ నిర్లక్ష్యపు చిరునవ్వు చూడటం నాకు చాలా కోపం తెప్పించింది. అధికారం.. సరిహద్దులు దాటడానికి అనుమతి ఇవ్వదు. నితీష్ కుమార్ గారు వెంటనే ఆ మహిళకు బేషరతుగా క్షమాపణ చెప్పి తీరాలి అని జైరా వసీం డిమాండ్ చేశారు. కాగా జైరా వసీం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
A woman’s dignity and modesty are not props to toy with. Least of all on a public stage. As a Muslim woman, watching another woman’s niqab being pulled at so casually, accompanied by that nonchalant smile, was so infuriating.
Power does not grant permission to violate…
— Zaira Wasim (@ZairaWasimmm) December 15, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- BiharCM
- HijabRow
- Niqab
- NitishKumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

