లెజెండరీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న చిత్రం ‘దాదా-ది సౌరవ్ గంగూలీ స్టోరీ’. రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్‌ని పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మే 14న ప్రేక్షకుల ముందుకురానుంది. బుధవారం సౌరవ్గంగూలీ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
2002లో ఇంగ్లాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక నాట్‌వెస్ట్ ట్రోఫీ విజయం తర్వాత లార్డ్స్ స్టేడియం బాల్కనీలో సౌరవ్ గంగూలీ జెర్సీ ఊపుతూ ఎమోషనల్‌గా రియాక్ట్ అయిన ఐకానిక్ మూమెంట్‌ను ఫస్ట్‌లుక్‌లో రీక్రియేట్ చేశారు.
సౌరవ్గంగూలీ నాయకత్వంలో భారత్ క్రికెట్ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నామని, భారతదేశంలోనే అత్యంత ప్రభావశీలమైన కెప్టెన్లలో ఒకరిగా ఆయన క్రికెట్ ప్రస్థానానికి దృశ్యరూపంగా ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. విక్రమాదిత్య మోత్వాని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి లవ్ రంజన్, అంకూర్ గార్గ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.