Pawan: పవన్ బర్త్ డే స్పెషల్..నేడు రానున్న సర్ప్రైజ్లు ఇవే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు 50వ వసంతంలోకి అడగుపెడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. పవన్ పేరుతో సేవా కార్యక్రమాలు అలానే కేక్ కటింగ్‌లు భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి తమ ప్రేమను తెలియజేస్తున్నారు. ఇక మేకర్స్ తమ సినిమాలకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
వకీల్ సాబ్ చిత్రంతో వెండితెరకు రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ భీమ్లా నాయక్ చిత్రంతో బిజీగా ఉండగా, ఈ సినిమా తర్వాత హరిహర వీరమల్లు చిత్ర షూటింగ్లో పాల్గొననున్నాడు.అనంతరం హరీష్ శంకర్ చిత్రం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
పవన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ క్యూ కట్టనున్నాయి. “భీమ్లా నాయక్”కి సంబంధించి ఈ రోజు ఉదయం 11:16 గంటలకు ఫస్ట్ సింగిల్ రాబోతుంది. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో చేస్తున్న పీరియాడికల్ మూవీ ‘హరి హర వీరమల్లు’ నుంచి మధ్యాహ్నాం 1:20 నిమిషాలకు అప్డేట్ రాబోతుంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి సంబంధించి మధ్యాహ్నాం 2:20 నిమిషాలకు అప్డేట్ రానుంది. ఇక హరీష్ శంకర్ మూవీ అప్డేట్ సాయంత్రం 4.05ని.లకు రానుంది. ఈ అప్డేట్స్ పవన్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా చేయనున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

