టాలీవుడ్ హీరో కల్యాణ్‌రామ్ (Kalyan Ram) టైటిల్ రోల్ చేస్తున్న బింబిసార (Bimbisara). హర్యాంక వంశస్థుడు మగధ రాజ్యాన్ని పరిపాలించిన బింబిసారుని జీవిత కథతో సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వశిష్ఠ్ (Vasisth) డైరెక్ట్ చేస్తున్నాడు. బింబిసార చిత్రం ఆగస్టు 5న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు ఓ అప్డేట్ తెరపైకి వచ్చింది.
తాజా ఈ సినిమా స్టోరీకి సంబంధించిన మరో కీ అప్డేట్ ఫిలినగర్‌లో చక్కర్లు కొడుతోంది. కల్యాణ్ రామ్ ఈ చిత్రంలో రెండు డిఫరెంట్ అవతారాల్లో కనిపించనున్నాడట. దీనిపై చిత్రయూనిట్ నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కేథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ (భీమ్లా నాయక్ ఫేం) ఫీ మేల్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు కిరణ్ కుమార్ మన్నే ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తుండగా.. తమ్మిరాజు ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు.