AR Murugadoss | సల్మాన్ ఖాన్ నయా ప్రాజెక్ట్.. 12 ఏండ్ల క్రేజీ కాంబో రిపీట్.. ?
AR Murugadoss | ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss) కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే.
AR Murugadoss | ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్లలో టాప్‌లో ఉంటాడు ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss). ఈ స్టార్ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి సినిమా వస్తుందంటే అంచనాలు భారీగానే ఉంటాయి. ఈ స్టార్ డైరెక్టర్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా పూర్తి చేసే కంటే ముందు మురుగదాస్ శివకార్తికేయన్‌తో చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తి చేయాల్సి ఉంది. ఇంకా టైటిల్ ఫిక్స్ కానీ సల్లూభాయ్-మురుగదాస్ కాంబో సినిమాపై ఆసక్తికరవార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ విద్యుత్ జమ్వాల్ విలన్‌గా కనిపించబోతున్నాడట. ఏఆర్ మురుగదాస్, విద్యుత్ జమ్వాల్ కాంబోలో వచ్చిన Thuppakki (2012) సూపర్ హిట్‌గా నిలిచింది. ఒకవేళ ఈ వార్త నిజమైతే మురుగదాస్-విద్యుత్జమ్వాల్ కాంబోలో 12 ఏండ్ల గ్యాప్ తర్వాత రాబోతున్న రెండో సినిమా కానుంది. మరి మురుగదాస్-విద్యుత్ జమ్వాల్ కలయికలో రాబోతున్న సినిమా గురించి మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
శాండల్‌వుడ్ రుక్మిణి వసంత్ ఈ చిత్రంలో ఫే మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీలక్ష్మి మూవీస్ పై ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. గతేడాది టైగర్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు సల్లూభాయ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

