Connect Movie | ఉత్కంఠ భరితంగా నయనతార కనెక్ట్ మూవీ ట్రైలర్..!
Connect Movie Trailer | లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత సినిమాల వేగాన్ని పెంచింది. పెళ్లయిన కొన్ని రోజులకే ముఃఖానికి రంగేసుకుంది. ప్రస్తుతం ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది.
Connect Movie Trailer | లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత సినిమాల వేగాన్ని పెంచింది. పెళ్లయిన కొన్ని రోజులకే ముఖానికి రంగేసుకుంది. ప్రస్తుతం ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతుంది. ఇటీవలే గాడ్‌ఫాదర్‌తో సూపర్ సక్సెస్ సాధించిన నయన్.. రీసెంట్గా వచ్చిన గోల్డ్‌తో డిజాస్టర్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈమె నటిస్తున్న కనెక్ట్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. మయూరి వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాన్ని తెరకెక్కించిన అశ్విన్ శరవణన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. తాజాగా చిత్రబృందం ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
భారతీయ సినీ చరిత్రలో తొలి సారిగా ఒక ట్రైలర్‌ను అర్ధరాత్రి 12గంటలకు రిలీజ్ చేయడం ఈ సినిమాకే జరిగింది. గతరాత్రి రిలీజైన ట్రైలర్ ఉత్కంఠభరితంగా సాగింది. లాక్డౌన్ సమయంలో జరిగే భూతవైధ్యం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా రన్ టైం కేవలం 90నిమిషాలు మాత్రమే ఉండనుంది. అంతేకాకుండా ఇంటర్వెల్ లేకుండానే ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించాడు. ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తుంది.
మయూరి, గేమ్ ఓవర్ వంటి హర్రర్ థ్రిల్లర్ సినిమాలకు దర్శకత్వం వహించిన అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించడంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్యరాజ్, అనుపమ్ ఖేర్, వినయ్ రాయ్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి పృథ్వి చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

