Jetlee Trailer | కమెడియన్ సత్య హీరోగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘జెట్లీ’ (Jetlee). రితేష్ రానా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ నిన్న గ్రాండ్‌గా విడుదలైంది. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మే 1న థియేటర్లలోకి రానుంది.
టాలీవుడ్లో తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించే కమెడియన్ సత్య హీరోగా నటించిన సినిమా ‘జెట్లీ’. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచగా, తాజాగా విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. మిస్ యూనివర్స్ ఇండియా-2024 రియా సింఘా ఈ సినిమాలో హీరోయిన్గా నటించడం విశేషం. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, వైవా హర్ష, అజయ్ ప్రధాన పాత్రల్లో నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ సినిమాకు కాల భైరవ సంగీతాన్ని అందించారు.