Colors Swathi | కలర్స్ స్వాతిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది స్వాతి రెడ్డి. క్యారెక్టర్ రోల్స్‌తోపాటు హీరోయిన్గా సూపర్ ఫ్యాన్ బేస్ ఖాతాలో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. స్వాతి రెడ్డి దర్శకుడు, ‘మంథ్ ఆఫ్ మధు’ ఫేం శ్రీకాంత్ నగోటిను పెళ్లి చేసుకుంది.
సంప్రదాయ పద్దతిలో వివాహ వేడుక జరుగగా.. స్వాతి రెడ్డి తన భర్త చేయి పట్టుకున్న ఫొటోలను ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని అభిమానులు, మూవీ లవర్స్‌తో షేర్ చేసుకుంది. ఇండస్ట్రీ స్నేహితులు, కోస్టార్లు, అభిమానులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న స్వాతికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీకాంత్ నగోటి డైరెక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా ‘మంథ్ ఆఫ్ మధు’ లో స్వాతిరెడ్డి, నవీన్‌చంద్ర హీరోహీరోయిన్లుగా నటించారని తెలిసిందే. ఈ ప్రాజెక్టు తర్వాత కొత్త సినిమాలకేం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు స్వాతి.
స్వాతి రెడ్డికి ఇది రెండో వివాహం. స్వాతి రెడ్డి మొదట తన బాయ్‌ఫ్రెండ్, మలయాళి పైలట్ వికాస్ వాసును 2018 ఆగస్టు 30న వివాహం చేసుకుంది. అయితే ఈ ఇద్దరు 2022లో విడాకులు తీసుకున్నారు.