CM Vijay | డ్రైవింగ్ సీట్లో దళపతి.. మెడికల్ సర్వీస్ జీప్‌ను టెస్ట్ డ్రైవ్ చేసిన సీఎం విజయ్!
Thalapathy Vijay | తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత 'దళపతి' విజయ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు.
Vijay Test Drive | తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత ‘దళపతి’ విజయ్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్న ఆయన.. తాజాగా ప్రభుత్వానికి సంబంధించిన ఒక కొత్త మెడికల్ సర్వీస్ జీప్‌ను స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధం చేసిన ఈ అత్యాధునిక అత్యవసర వాహనాన్ని స్వయంగా ఆయనే నడిపి, దాని పనితీరును పరిశీలించారు.
ఈ టెస్ట్ డ్రైవ్‌కు సంబంధించిన విజువల్స్ మరియు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. సాధారణంగా ముఖ్యమంత్రులు ఇలాంటి వాహనాలను జెండా ఊపి ప్రారంభించడం చూస్తుంటాం, కానీ విజయ్ మాత్రం ప్రోటోకాల్ పక్కనబెట్టి స్వయంగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టీరింగ్ తిప్పడం అభిమానులను, ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బ్లాక్ కలర్ సూట్లో పవర్‌ఫుల్‌గా కనిపిస్తూ ఆయన జీప్ నడిపిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడు వ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాల ప్రజలకు అత్యవసర సమయాల్లో వైద్య సేవలను వేగంగా చేరవేయడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక వాహనాలను రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. సీఎం విజయ్ స్వయంగా ఈ జీప్‌ను డ్రైవ్ చేసి అందులోని సౌకర్యాలను, కంఫర్ట్‌ను స్వయంగా చెక్ చేయడం ఆయనకు ప్రజారోగ్యంపై ఉన్న శ్రద్ధను చూపిస్తోందని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
BREAKING: மருத்துவம் & மக்கள் நல்வாழ்வுத்துறை சார்பில் ரூ.2.90 கோடி மதிப்பில் வாங்கப்பட்ட 40 புதிய வாகனங்களின் சேவையை தொடங்கி வைத்தார் முதலமைச்சர் ஜோசப் விஜய். pic.twitter.com/VM4jzwLAyW
— Actor Vijay Team (@ActorVijayTeam) May 20, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

