Yatra 2 Movie Teaser | సీఎం జగన్ బయోపిక్.. ‘యాత్ర 2’ టీజర్ రిలీజ్
Yatra 2 | ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్న తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది.
Yatra 2 | ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్న తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మోషన్ పోస్టర్‌తో పాటు, ఫస్ట్ లుక్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే.. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఇక ఈ టీజర్ గమనిస్తే.. వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ బయటకు వచ్చి కొత్త పార్టీ పెట్టడం, జగన్ జైలుకు వెళ్లడం ఇలా ప్రతిది 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయాల చుట్టూ తిరుగుతూ ఆసక్తికరంగా సాగింది. ఇక చివరిలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నేను వైఎస్. రాజశేఖర్‌రెడ్డి కొడుకుని అంటూ జీవా చెప్పే డైలాగ్ టీజర్‌కే హైలెట్‌గా నిలిచింది.
ఇదిలా ఉండగా.. యాత్ర ఫస్ట్ పార్టులో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా.. సెకండ్ పార్టులో మమ్ముట్టి, జీవా లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్, శివ మేక సంయుక్తంగా నిర్మిస్తున్న ‘యాత్ర 2’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను 2024 ఫిబ్రవరి 08న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రయూనిట్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

