Game Changer | రాంచరణ్ గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది..!
Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్ట్ చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీ విడుదలపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
Game Changer | టాలీవుడ్ స్టార్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం గేమ్‌ఛేంజర్ (Game changer). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్ట్ చేస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో వస్తోన్న ఈ మూవీలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, రాజోల్ సుందరి అంజలి ఫీమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందనే విషయమై ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. విడుదలపై మేకర్స్ నుంచి అధికారికంగా ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది.
దీపావళి సీజన్‌కి ఇతర తెలుగు, తమిళ భారీ సినిమాలు విడుదల కానందున ఈ సీజన్లో మా గేమ్ ఛేంజర్‌ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మీడియాతో చిట్‌చాట్‌లో చెప్పడంతో రిలీజ్‌పై డైలామాకు చెక్ పడినట్టైంది. అభిమానులు ఇంకేంటి మరి దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకునేందుకు సిద్దం కండి. తాజా సమాచారం ప్రకారం సీజీ వర్క్స్ పూర్తయ్యాయి. మరోవైపు దీపావళికి భూల్ భూలయ్యా 3, సింగం అగెయిన్ దీపావళికి విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై సూపర్ బజ్ క్రియేట్ అవుతుండగా.. మరి గేమ్ ఛేంజర్ హిందీ బెల్ట్‌లో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్లర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రానికి పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీకి ఎస్ థమన్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

